32.2 C
Hyderabad
May 12, 2024 22: 59 PM
Slider ముఖ్యంశాలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

#CITU

కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడదామని సిఐటియు నాగర్ కర్నూల్ జిల్లా సహాయ కార్యదర్శి ఈశ్వర్ పిలుపునిచ్చారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు. నిత్యావసర ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతూ కనీస వేతనం అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతుందని అన్నారు.

అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్బాలు పలికి ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తీసివేసి, కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రక్షణ రంగం, బ్యాంకులను  ప్రవేట్ పరం చేస్తే కార్మిక వర్గం కన్నెర్ర చేస్తుందని అన్నారు.

నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. 29న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జరిగే మహాధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐకెపి వివో ఎలా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, సిపిఎం మండల కార్యదర్శి శివవర్మ, ఆర్టీసీ ఎస్ డబ్ల్యూ ఎఫ్ డిపో కార్యదర్శి మధుసూదన్, అంగన్వాడి జిల్లా నాయకురాలు నీరజ, ఆశ వర్కర్ల జిల్లా నాయకురాలు శ్రీదేవి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్, కురుమయ్య, మున్సిపాలిటీ నాయకులు కురుమయ్య రామస్వామి, హమాలీ సంఘం నాయకులు బురాన్, సత్యం, పట్నం సంఘం కన్వీనర్ సలీం, బ్యాంకు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు బాల పేరు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జల్లాపురం సురేందర్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శేఖర్ వివో ఎలా సంఘం మండల అధ్యక్షులు నరసింహ అలివేల హమ్మిన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్ల విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

కూతురు పెళ్లికి సీఎంను ఆహ్వానించిన ఉద్య‌మ‌ రైతు

Sub Editor

పాకిస్తాన్ ఉగ్రవాదంపై తాలిబాన్ల ధ్వజం

Satyam NEWS

Leave a Comment