40.2 C
Hyderabad
May 2, 2024 15: 18 PM
Slider విజయనగరం

దేశాన్ని కాపాడేందుకే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి !

#aituc

కేంద్రంలో  మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా దేశవ్యాప్త సమ్మెతో మరో స్వాతంత్ర్య పోరాటానికి శ్రీకారం చుట్టామ‌ని  ఏఐటీయూసీ విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు హెచ్చరించారు.

ఈ మేర‌కు  ఏఐటీయూసీ ఇచ్చిన పిలుపు మేర‌కు  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ  న‌గ‌రంలో బైక్ ర్యాలీ నిర్వ‌హించారు..స్థానిన ట్యాంక్  వ‌ద్ద   అమర్ భవన్ వద్ద ప్రారంభమైన  బైక్ ర్యాలీ.. బాలాజీ సెంటర్ ,,కోట, మూడులాంతర్లు, గంట స్థంభం, స్టేట్ బ్యాంక్ మైన్ బ్రాంచి, , సీఎమ్ఆర్,,రైల్వే స్టేషన్ మీదుగా,ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా,అమర్ భవన్ వద్దకు చేరుకుంది.

అనంతరం జరిగిన సభలో, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్.రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా  దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిందన్నారు.

మోడీ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ళల్లో దేశాన్ని ఆదానీ, అంబానీల్లాంటి కార్పోరేట్ సంస్థలకి అప్పనంగా అమ్మేస్తున్నార‌ని ఆరోపించారు. మోనిటైజేషన్ పథకం ద్వారా తాకట్టు పేరు చెప్పి ప్రజల ఆస్తులను కారుచౌకగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

అందుకే ప్రజానీకం అంతా ఈ సమ్మెలో భాగస్వామ్యమై మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని కోరారు. కనీస వేతనాలు 26 వేలు, సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిషోళ్ళతో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లుగా మార్పులు చేసి కార్మికులను కార్పొరేట్లకు కట్టుబానిసలుగా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్య‌క్తం చేసారు.

అసంఘటితరంగంలో ఉన్న ఆటో, మోటార్ ట్రాన్స్పోర్ట్, హమ్మలీ కార్మికులకు, వీధివిక్రయదారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్సులు టి.జీవన్, కె.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పలరాజు దొర, మజ్జి ఆదిబాబు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ర్ర అధ్యక్షులు కె.శ్రవంతి, ఏఐటీయూసీ నాయకులు ఆర్టీసీ శ్రీనివాస్, ఆల్తి మారయ్య, అప్పరుబోతు జగన్నాధం, పొందూరు రాంబాబు, పొందూరు అప్పలరాజు, ఎమ్.ఎల్లంనాయుడు, బూర వాసు,  కార్మికులు పాల్గొన్నారు

Related posts

ఆత్మస్థైర్యంతో పని చేయండి…అధికారం మళ్ళీ మనదే

Bhavani

మహబూబ్ నగర్ లో ఒకేషనల్ విద్యార్థుల అప్రెంటిస్షిప్ జాబ్ మేళా

Satyam NEWS

అధికారంలో ఉన్నా లేకున్నా ఆపన్నుల్ని ఆదుకుంటాం

Satyam NEWS

Leave a Comment