42.2 C
Hyderabad
April 26, 2024 17: 48 PM
Slider వరంగల్

కూతురు పెళ్లికి సీఎంను ఆహ్వానించిన ఉద్య‌మ‌ రైతు

wedding card

తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్నివినిపించిన పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలానికి చెందిన రైతు ఫణికర మల్లయ్య తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి తన కుమార్తె పెండ్లికి ఆహ్వానిస్తూ పెళ్లికార్డును అందించారు.

తాను కోరుకున్నరైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో, నాటి ఉద్యమ సారధి, ముఖ్యమంత్రి కేసిఆర్ ను తన బిడ్డ పెండ్లికి ఆహ్వానించే అవ‌కాశం దొర‌క‌డం సంతోషంగా ఉంద‌న్నారు. మంత్రి ఎర్ర‌బెల్లి స‌హ‌కారంతోనే సీఎం కేసీఆర్‌ను పెళ్లికి ఆహ్వానించిన‌ట్లు తెలిపారు. సీఎం త‌న కుమార్తె పెళ్ళికి వ‌స్తే మ‌రింత సంతోషిస్తాన‌ని త‌మ లాంటి తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు మ‌రింత బ‌లం చేకూరుతుంద‌ని అన్నారు.

Related posts

ప్ర‌జ‌లను అలెర్ట్ చేస్తున్న విజయనగరం పోలీసులు

Satyam NEWS

దేవాదాయ శాఖ ఈవోల సంఘం అధ్యక్షుడుగా పురంధర్

Satyam NEWS

మహారాష్ట్ర లో మరో సాధువు దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment