31.2 C
Hyderabad
May 3, 2024 01: 36 AM
Slider కవి ప్రపంచం

సంక్రాంతి సందళ్లు

#Manjula Surya New 23

ముగ్గులో ముచ్చటగా గొబ్బిళ్ళు

ఉబ్బు  తబ్బిబ్బు వాకిళ్ళు

కళ కళ లాడుతూ ఇంటి ముంగిళ్లు

గుమ్మానికి పచ్చని పత్రమావిళ్ళు

బంతి చేమంతుల పచ్చని పరవళ్లు

గాలిపటమేమో పైపైకె వెళ్లు

ధాన్యాన్ని నింపుకొని వచ్చునెడ్లబండ్లు

కొంగ్రొత్త దుస్తులతో ఆడపిల్లలు తుళ్ళు

సరస సయ్యాటలలో కొత్త అల్లుళ్ళు

పిల్లా పాపలకి కనువిందు భోగిపళ్ళు

బంధుమిత్రుల కేరింతల ఆగళ్ళు

అంతటా ఆనందమే పొంగి పొర్లు

గంగిరెద్దు బసవన్నలు తిరిగేరు ఇల్లిల్లు

హరిదాసు సంకీర్తనలతో మైమరిచే ఒళ్ళు

చకినాలు లడ్డూలతో ఘుమ ఘుమలు వంటిల్లు

అందరి మోముపై చిరునవ్వు శోభిల్లు

తర్వాతి తరానికి చేరునివే వేళ్ళు

సంప్రదాయానికి పండుగలే ఆనవాళ్లు

ఆయురారోగ్యాలతో భోగ భాగ్యములతో

జీవించాలి అందరూ నిండు నూరేళ్లు

సంక్రాంతి శుభాకాంక్షలతో

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

మీ అబ్బాయి ప్రజలకు చెప్పిందేమీ చేయడం లేదు

Satyam NEWS

లాక్ డౌన్ వేళ ఐఐటీ-జేఈఈ, నీట్ ఆన్ లైన్ మాక్ టెస్టులు

Satyam NEWS

కేసీఆర్ వి పిట్టల దొర కథలు

Bhavani

Leave a Comment