33.7 C
Hyderabad
April 30, 2024 00: 51 AM
Slider నల్గొండ

పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పేట వేస్తున్నాం

#Hujurnagar Municipality

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో పౌర సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ అంశంపై నేడు హుజూర్ నగర్ పురపాలక సంఘం సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 102 అంశాలను సమావేశం ఆమోదించింది.

ఈ సమావేశంలో 105 అంశాలతో కూడిన ఎజెండాను ప్రవేశపెట్టగా 102 అంశాలను తీర్మానించారు. మిగిలిన మూడు అంశాలను తిరస్కరించారు. 2020 -2021 సంవత్సరానికి సంబంధించిన పనులను ఆమోదించేందుకు, పట్టణములోని ఇతర అభివృద్ధి పనులు, ఆరవ విడత హరితహారం కార్యక్రమానికి ఏర్పాటు తదితర అంశాలను చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది.

గురువారం ఉదయం 11 గంటలకు జి వి పి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి  మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి అధ్యక్షత వహించారు. హుజూర్ నగర్ పురపాలక సంఘం పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన పనులు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం, స్ట్రీట్ పెండింగ్ జోన్ల ఏర్పాటు, ఇతర అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ ఆమోదించింది.

ఈ  సమావేశంలో వైస్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఉత్తమ్ పద్మావతి

Satyam NEWS

క‌మ‌ల‌నాధులు ఒత్తిళ్లే..బ‌దిలీకి కార‌ణ‌మా..?

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్

Satyam NEWS

Leave a Comment