29.7 C
Hyderabad
May 7, 2024 04: 46 AM
Slider ఖమ్మం

మట్టి గణపతి విగ్రహాలు ప్రతిష్టించాలి

#Clay Ganapati idols

పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని, ప్రజలందరూ స్వచ్చంధంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలని అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనపు ఏర్పాట్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు, స్ధంబ్రాద్రి ఉత్సవ కమిటీ బాధ్యులతో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలకు మెరుగైన ఏర్పాట్లకై సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ సూచించారు. వినాయకచవితి సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టించి, నవరాత్రి ఉత్సవాల అనంతరం నిమజ్జనం చేసేందుకు, మండపాల ఏర్పాటుకు గాను పోలీసు, సౌండ్‌ స్టిమ్‌, లైటింగ్‌, తదితర వసతులకై ఆయా మండపాల, ఉత్సవ కమిటీ బాధ్యులు ముందస్తు గానే అనుమతి పొందాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకై కేవలం మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా ఉత్సవ కమిటీలు ప్రజలను చైతన్యపర్చి ప్రోత్సహించాలన్నారు. నగరంలోని మున్నేరు. ప్రకాష్‌నగర్‌ రెండు ప్రాంతాలలో గణేష్‌ నిమజ్జనం ఉంటుందని, అందుకనుగుణంగా ఆయా ప్రాంతాలకు విగ్రహాలను నిమజ్జనం కొరకు తరలించేందుకు ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని, పోలీసు అధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు.

నిమజ్జన ప్రాంతాలలో పారిశుధ్యం, త్రాగునీరు, లైటింగ్‌, బారికేడిం గ్‌, నిమజ్జన ప్లాట్‌ఫామ్స్‌ క్రేన్స్‌ తదితర ఏర్పాట్లను నగరపాలక సంస్థ ద్వారా చేపట్టాలని, నిమజ్జన ప్రదేశాలలో గజ ఈతగాళ్ళను సిద్దంగా ఉంచాలని, అగ్ని ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని, మత్స్య, అగ్నిమాపక శాఖ అధికారులను అదనపు కలెక్టర్‌ సూచించారు.

వినాయక విగ్రహాల మండపాల వద్ద అగ్నిప్రమాదాలు సంభవించకుండా తరచుగా తణిఖీ చేపట్టాలని అదేవిధంగా నిమజ్జన ప్రదేశాలలో సరిపడా లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు. నిమజ్జనం రోజన 24 గంటల పాటు మధ్యం షాపులను పూర్తిగా మూసివేయాలని, ఎక్సైజ్‌ శాఖాధికారులకు అదనపు కలెక్టర్‌ సూచించారు. నిమజ్జన ప్రాంతాలలో ప్రథమ చికిత్స కేంద్రాల ఏర్పాటు చేసి అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని వైద్యశాఖాధికారులకు సూచించారు.

ఖమ్మం నగరంతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీ పరిధిలో నిమజ్జన ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని మున్సిపల్‌ కమీషనర్లను ఆయన సూచించారు.సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం,ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీల సహకారంతో మరింత మెరుగైన వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లను చేపడ్తామన్నారు. ప్రజలందరూ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించే విధంగా ప్రోత్సహిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు.

విద్యుత్‌ శాఖ ఎస్‌.ఈ సురేందర్‌, జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్‌రావు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమీషనర్‌ మల్లీశ్వరీ, మున్సిపల్‌ ఇ.ఇ కృష్ణలాల్‌, ఎక్స్‌జ్‌ సూపరింటెండెంట్‌ నాగేందర్‌రెడ్డి, డిప్యూటీ డిఎం.అండ్‌.హెచ్‌.ఓ డా॥సైదులు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయప్రకాష్‌, ఏసిపిలు గణేష్‌, రామానుజం, డివిజనల్‌ పంచాయితీ అదికారి పుల్లారావు, ఖమ్మం, కల్లూరు ఆర్‌.డి.ఓలు గణేష్‌, అశోకచక్రవర్తి, ఖమ్మం ఆర్భన్‌, రూరల్‌ తహశీల్దార్లు స్వామి, రామకృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు కన్నం ప్రసన్న కృష్ణ, వినోద్‌లహోటి, దండా జ్యోతి రెడ్డి, డి.జయ్‌కిరణ్‌, దిలీప్‌ కుమార్‌, అల్లిక అంజయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

మిచౌంగ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

పోలీస్ డైరీ: ఈ రంజాన్ ఖాసిం కు ఆకలి లేని పండుగ కావాలి

Satyam NEWS

అక్రమంగా రైస్ మిల్లుకు తరలించిన రేషన్ బియ్యం స్వాధీనం

Bhavani

Leave a Comment