38.2 C
Hyderabad
May 2, 2024 19: 16 PM
Slider గుంటూరు

మిచౌంగ్ తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలి

#mvenugopalreddy

మిచౌంగ్ తుఫాన్ కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. తుఫాను జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలున్నందున అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ : 0863-2234014.

నదులు, వంకలు పరివాహ ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లో ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశం జారీ చేశారు. ప్రజలు, రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యం, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలి. అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే  పైన తెలిపిన కంట్రోల్ రూమ్  నెంబరుకు ఫోన్ చేసి తక్షణం సహాయం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Related posts

30వేల మందికి పైగా గాంధీ చిత్ర వీక్షణ

Bhavani

ప్రధాని మోడీని గద్దె దించేందుకు… ఇప్పటి నుంచే కసరత్తు..!

Satyam NEWS

నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ లో భారీ కుంభకోణం

Satyam NEWS

Leave a Comment