26.7 C
Hyderabad
May 3, 2024 07: 20 AM
Slider తెలంగాణ

మిషన్ భగీరథ పై రెండు మాటలు మాట్లాడుతున్న బిజెపి

Bhatti-Vikramarka

తెలంగాణ బిజెపి నాయకులు మిషన్ భగీరథ స్కీమ్ ఒక పెద్ద స్కామ్ అని అంటుంటే కేంద్ర మంత్రి హైదరాబాద్ వచ్చి మిషన్ భగీరథ ఆదర్శ పథకమని చెబుతున్నారని ఇది ఏమి మతలబు అని కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రాష్ట్ర బిజెపి చెప్పినట్లు మిషన్ భగీరథ ఒక పెద్ద కుంభకోణం అయితే దాన్ని కేంద్ర మంత్రి దేశం మొత్తం అమలు చేసి కుంభకోణాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళతారా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో స్కామ్ ఎలా చెయ్యాలనే ఉద్దేశంతో స్కీమ్ లను తెస్తున్నారని, కేంద్ర మంత్రులు స్కీమ్ లు బాగున్నాయి అంటుంటే…లక్ష్మణ్ మాత్రం అన్ని స్కామ్ లే అంటారు. బీజేపీ కి టీఆరెస్ కి ఉన్న సంబంధం ఎలా ఉన్నా ప్రజలను ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారని భట్టి అన్నారు. ఈ 50 వేల కోట్ల స్కీమ్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్:ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా

Satyam NEWS

ఓట్ల లెక్కింపునకు గుంటూరు రూరల్ పోలీస్ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

కొప్పరపు కవుల కవితా ప్రశస్తి గ్రంథం ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment