కొప్పరపు సోదరకవుల ఆశుకవితా వైజయంతి పేరుతో నెల్లూరు లో సారస్వతసభ జరిగింది. కొప్పరపు కవుల కవితా ప్రశస్తి పేరుతో లఘు గ్రంథం ఆవిష్కరించారు. నెల్లూరు పద్య సారస్వత పరిషత్ ఈ సభ నిర్వహించింది. డాక్టర్ సింగరాజు రామకృష్ణప్రసాదరావు ( సింహారాజు) ఈ గ్రంథం రచించారు. పోలవరపు లక్ష్మీనరసింహారావు, శతావధాని డాక్టర్ సూరం శ్రీనివాసులు, శతావధాని కొండపి మురళీకృష్ణ, మాశర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొప్పరపు కవులకు – నెల్లూరుకు ఎంతో అనుబంధం ఉంది. కొప్పరపు కవుల రెండవ బిరుదు ‘ఆశుకవీంద్ర సింహ’ ఇక్కడే పొందారు. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి డిప్యుటీ కలెక్టర్ (బ్రిటిష్ కాలంలో) జయంతి రామయ్యపంతులు అధ్యక్షతలో ఈ బిరుదు ప్రదానం జరిగింది. పక్కనే ఉన్న బుచ్చిరెడ్డిపాలెంలో బెజవాడ పట్టాభిరామిరెడ్డి ( గోపాలరెడ్డి గారి తండ్రి ) కొప్పరపు వారి ఆశుకవితా సభ ఏర్పాటుచేసి, విజయఘంటికలు తొడిగి, ఘన సత్కారం చేశారు. పట్టాభిరామిరెడ్డి గారు మద్రాస్ లో, నెల్లూరులో కూడా కొప్పరపువారి సభలు ఎన్నో నిర్వహించారు. వారి కుమారులు బెజవాడ గోపాలరెడ్డి గారు కూడా కొప్పరపు కవుల సోదరులతో, కుమారులతో అనేక సభలు నిర్వహించారు. నెల్లూరుకే చెందిన మహాపండితుడు వేదం వేంకటరాయశాస్త్రి గారు కొప్పరపు సోదర కవుల అనేక సభల్లో పాల్గొన్నారు. మా నాన్నగారు, వారి పూర్వీకులు పాత నెల్లూరు జిల్లావారు కూడా కావడం ఇక్కడ విశేషం
previous post