23.7 C
Hyderabad
May 8, 2024 03: 41 AM
Slider కడప

సీఎం స్థాపించిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

Srikanth Reddy

జగనన్నఆలోచనలు అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం పట్టణంలోని వై ఎస్ ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వ‌హించిన‌ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో ఎం ఎల్ సి జకియా ఖానం, జెడ్ పి మాజీ వైస్ ఛైర్మన్ దేవనాథరెడ్డి తదితర నాయకులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని భారీ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలన సంక్షేమ, అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. దేశంలోనే తిరుగులేని నాయకుడిగా జగన్ ఎదుగుతున్నార‌ని జోస్యం చెప్పారు. పదికాలాల పాటు జగన్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలుతో, మరెన్నోఉన్నత పదవులు పొందాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సలావుద్దీన్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపిపిలు పోలు సుబ్బారెడ్డి, జనార్ధన రెడ్డి, జెడ్ పి టి సి అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్ పి టి సి ఉపేంద్రా రెడ్డి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు దశరథ రామిరెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, అలీనవాజ్ ఖాన్, హాబీబుల్లా ఖాన్ మహమ్మద్ ఖాన్, చిదంబర్ రెడ్డి, ఫయాజుర్ రవామన్, సలీం, ఆనంద్ రెడ్డి, జిన్నాషరీఫ్, కొలిమి ఛాన్ బాషా, పల్లపు రమేష్, జాకీర్, విజయభాస్కర్, నరసింహా రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, యదుభూషన్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, మదన మోహన్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, ఫయాజ్ అహమ్మద్, సుగవాసి శ్యామ్, కొత్తిమీర ప్రసాద్, గువ్వల బుజ్జిబాబు, రమేష్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వివాదాస్పదంగా ఆమీర్ యాడ్‌.. బీజేపీ ఎంపీ అభ్యంతరం..

Sub Editor

ఖమ్మం లో రూ.36 కోట్లతో ఐటి హబ్ రెండో దశ

Satyam NEWS

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు

Satyam NEWS

Leave a Comment