29.7 C
Hyderabad
May 1, 2024 03: 31 AM
Slider కడప

కార్పొరేట్ కు అమ్ముడుపోయిన విద్యాశాఖాధికారులు

#pdsu

వైయస్సార్,అన్నమయ్య జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాలు పేరుతో తల్లిదండ్రుల దగ్గర నుండి దోపిడీకి గురిచేస్తున్నారని విద్యాశాఖధికారులుకు యాజమాన్యాలకు అమ్ముడుపోయారని పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అంకన్న ఆరోపించారు.

నగరంలోని వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పిడియస్ యు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… కడప నగరం,ప్రొద్దుటూరు,బద్వేల్, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, పులివెందుల ప్రాంతాలలో పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఏటువంటి అనుమతి లేకుండా పాఠ్యపుస్తకాలు పేరుతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర నుండి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని, విద్యార్థి సంఘాలగా అనేక పిర్యాదులు చేసిన ఎటువంటి విచారణ,చర్యలు చేపట్టలేదు అన్నారు.

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం,ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ప్రభుత్వం టెండర్ ద్వారా ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలు,నోట్ పుస్తకాలు, వర్క్ బుక్కులు,మూడు జతల యూనిఫామ్ కుట్టుకూలీతో సహా,ఒక జత బూట్లు సాక్షులతో సహా, బెల్టు, స్కూల్ బ్యాగ్ తో పాటు,డిక్షనరీ ఇలా అన్నిటికీ కలిపి కేవలం మొత్తం 2,400 రూపాయలు ఖర్చు చేస్తుందని, అదే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో వారు ఇచ్చే 7,8 పుస్తకాలకే 6,000 నుండి 10 వేల రూపాయలు తీసుకుంటున్నారు.

వాళ్ళ ఆదాయం మొత్తం సగ భాగం పుస్తకాల్లోనే సంపాదిస్తున్నారు.సీఎం జిల్లాలోనే ఫీజులు డొనేషన్ల రూపంలో మరియు పాఠ్యపుస్తకాలతో సహా దోపిడికి గురి చేస్తున్నారని, పాఠశాల విద్యాశాఖ ఆర్జెడి వెంకటకృష్ణారెడ్డి,వైస్సార్ జిల్లా డీఈవో రాఘవరెడ్డి,అన్నమయ్యా జిల్లా డిఈఓ పురుషోత్తం,డిప్యూటి డిఈఓలు రాజగోపాల్ రెడ్డి,కృష్ణప్ప, వరలక్ష్మిలు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు రెన్యువల్ విషయంలో మామూళ్లు తీసుకొని అనుమతలు ఇస్తున్నారని అందుకే ప్రతి ఏటా నియోజవర్గ కేంద్రాలలో అనేక కార్పొరేట్ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.

అదే విధంగా  గుర్తింపు లేని పాఠశాలల దగ్గర నుండి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని అందుకే గుర్తింపు లేని పాఠశాలల వివరాలు  ప్రకటించలేదన్నారు. కావున ఇప్పటికైనా స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తనిఖీ సమయంలో విద్యార్థి, యువజన సంఘాలను అనుమతించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిడియస్ యు నగర నాయకులు శ్రీనివాసులు రెడ్డి, అన్నమయ్య జిల్లా పిడిఎస్ యు నాయకులు అక్రమ,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజానగరం హైస్కూల్ లో దారుణం

Satyam NEWS

నేనైతే ఎంపీ గానే పోటీ చేస్తాను: రఘురామ కృష్ణంరాజు

Satyam NEWS

అఖిలపక్ష పోరాటంతో  డబల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య ఉన్న చెత్త తొలగింపు

Satyam NEWS

Leave a Comment