26.7 C
Hyderabad
May 3, 2024 08: 58 AM
Slider నిజామాబాద్

అంబేడ్కర్ ను అవమానించిన కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హత లేదు

#arunatara

రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా రథసారథి అరుణ తార మాట్లాడుతూ మహిళ అని కూడా చూడకుండా కేంద్ర ఆర్థిక మంత్రి పట్ల ముఖ్యమంత్రి వాడిన పదజాలం దారుణమని అన్నారు. రాష్ట్రంలో పాలన చేత కాక ఎక్కడి వ్యవస్థలు అక్కడ నిర్వీర్యం అవుతుంటే చూడని కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం  విచారకరం అని అన్నారు. ఇది రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను అవమానించడమే అని అన్నారు. ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సరి కాదన్నారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కాగజ్ నగర్ లో ఎయిడ్స్ క్యాండిల్ లైట్ ర్యాలీ

Satyam NEWS

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

Satyam NEWS

విశాఖలో కిరాతకం: ఆరుగురి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment