39.2 C
Hyderabad
May 3, 2024 12: 15 PM
Slider హైదరాబాద్

అసంఘటిత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత సిఎం కేసీఆర్‌ దే

#ministermallareddy

అసంఘటిత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత  సిఎం  కేసీఆర్‌ కే దక్కుతోందని అన్నారు. ఆదివారం  తెలంగాణ రాష్ట్ర హమాలీ సంఘం అధ్యక్షుడు హమాలి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చెంగిచెర్ల పూసల గోడౌన్‌లో నిర్వహించిన బోనాల పడుగ సన్మాన కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి , టీఆర్‌ఎస్‌ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ హమాలి శ్రీనివాస్‌  ప్రతి సవంత్సరం ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారని అభినందించారు. అదే విధంగా  అసంఘటిత కార్మికులను అన్ని విధాలా ఆదుకున్న ఘనత  సిఎం  కేసీఆర్‌ కే దక్కుతోందని తెలిపారు. ఆశ కార్యకర్తలు, మెప్మాలో పనిచేస్తున్న వారికి, హమాలీ సోదరులకు వేతనాలు పెంచి వారికి తగిన గుర్తింపు ఇచ్చిన ప్రభుత్వం  తెలంగాణ ప్రభుత్వమని కొనియాడారు.

కార్యక్రమంలో  అసంఘటిత కార్మిక వెల్ఫేర్‌బోర్డు చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణ, బోడుప్పల్‌ మేయర్‌ సామల బుచ్చిరెడ్డి, కొత్త లక్ష్మిరవిగౌడ్‌, కార్పోరేటర్‌లు మీర్‌పేట్‌ హెచ్‌బికాలనీ   జెర్రిపోతల ప్రభుదాస్‌, మల్లాపూర్‌ కార్పోరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి, మాజీ కార్పోరేటర్‌లు గొళ్ళూరి అంజయ్య, గుడారపు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌నాయకులు సాయిజన్‌శేఖర్‌, జనుంపల్లి వెంకటేశ్వరరెడ్డి, గరిక సుధాకర్‌, కిరణ్‌కుమార్‌రెడ్డి, శైలేష్‌రెడ్డి, నిర్మల రెడ్డి,శ్రావణ్‌కుమార్‌రెడ్డి, బోడుప్పల్‌ కార్పోరేటర్‌లు ,బోడుప్పల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రెసిడెంట్‌ మంద సంజీవరెడ్డి, మరయ్య, దర్గా దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

టెలిఫోన్ ట్యాపింగ్ పై రఘురాముడి ఫిర్యాదు

Satyam NEWS

మహిళా దినోత్సవ సందర్భంగా కార్మిక మహిళలకు ఘన సన్మానం

Satyam NEWS

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment