37.2 C
Hyderabad
May 2, 2024 11: 55 AM
Slider నిజామాబాద్

శభాష్: నిత్యావసరాలు పంచిన సహకార సంఘం

#KotagiriMandal

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 100  నిరుపేద కుటుంబలకు సహకార సంఘం ఛైర్మెన్ అశోక్ పటేల్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా  సహకార సంఘం ఛైర్మెన్ అశోక్ పటేల్ మాట్లాడుతూ ఎత్తోండ సహకార సంఘం పరిధిలోని గ్రామాలైన  ఎత్తోండ, యాద్గార్పూర్, వల్లభాపూర్, సిద్దాపూర్, ఎత్తోండ క్యాంప్ గ్రామాల్లోని 100 నిరుపేద కుటుంబాలను గుర్తించి సహకార సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందచేసినట్లు తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించినందున పనులు లేక నిరుపేదలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం కుటుంబానికి 1500 రూ.లు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసిందన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు సక్రమంగా పాటించండి

రేషన్ కార్డు లేని నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి సహకార సంఘం ద్వారా సహకారం అందిస్తున్నామన్నారు. లాక్ డౌన్ లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే తప్పకుండా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పనులు ముగించుకోవాలని సూచించారు.

కారోన  వైరస్ నియంత్రించేందుకు ప్రజలు స్వీయ నియంత్రణ తప్పక పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కిషోర్ పటేల్, లింగయ్య, గంగధర్,శ్యామ్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో నిలిచిపోయిన డిక్లరేషన్

Satyam NEWS

డేంజర్ బెల్స్: వద్దంటే చేయడమే వారి నైజం

Satyam NEWS

ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడి రూపమిదే!

Satyam NEWS

Leave a Comment