ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నది. ప్రధాన నగరాలతో పాటు అన్ని చోట్లా వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అన్ని చోట్లా బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. రాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపివేశారు. అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి ఎవరూ రావద్దంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
లాక్ డౌన్ ను అధికార యంత్రాంగం కఠినంగా అమలు చేస్తున్నది. నిర్దిష్టమైన కారణం లేకుండా వాహనాలతో రోడ్లపైకి వచ్చి వాళ్ళను నిలిపివేసి పోలీసులు ఫైన్ విధిస్తున్నారు. పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రామవరప్పాడు వద్ద పోలీస్ చెక్ పోస్ట్ దాటేందుకు అతి వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ కి తీవ్ర గాయాలు అయ్యాయి.