39.2 C
Hyderabad
April 28, 2024 13: 49 PM
Slider పశ్చిమగోదావరి

ప్రాణాలకు తెగించి బాలిక ప్రాణాలు కాపాడిన జర్నలిస్ట్

#mahanews

కాలువలోకి దూకి ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించిన 16 ఏళ్ల బాలికను అత్యంత చాకచక్యంగా ప్రాణాలకు తెగించి ఒక జర్నలిస్ట్ కాపాడిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో చోటుచేసుకుంది.

తణుకు పట్టణ ఎస్.ఐ కె.గంగాధర్ అందించిన వివరాలు ప్రకారం తణుకు పాతురు కు చెందిన 16 ఏళ్ల బాలిక ఆదివారం రాత్రి ఎగ్జిబిషన్ కు వెళ్లి స్నేహితులతో మాట్లాడుతుండగా, అబ్బాయిలతో మాటలు ఏంటని తల్లి మందలించడంతో మనస్తాపం చెంది తణుకు అత్తిలి కాలువలోకి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది.

అదే సమయంలో అటుగా వెళ్తున్న నిడదవోలు,మహా టీవీ రిపోర్టర్ వీరేంద్ర బాలిక దూకడం గమనించి వెంటనే కాలువలోకి దూకి బాలికను రక్షించాడు.  తణుకు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బాలికకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులుకు అప్పగించినట్లు ఎస్.ఐ గంగాధర్ తెలిపారు. ప్రాణాలకు తెగించి బాలికను రక్షించిన మహా టీవీ రిపోర్టర్ వీరేంద్ర ను గంగాధర్ అభినందించారు.

Related posts

స్వధార్ ఆశ్రయంకు ఆహార పదార్ధాల అంజేత

Satyam NEWS

ఆసక్తిరేపుతున్న నందమూరి తారకరత్న, నారా లోకేష్ ల భేటీ..?

Bhavani

సమస్యల వలయంలో వనపర్తి కొత్త బస్టాండు

Satyam NEWS

Leave a Comment