Slider మహబూబ్ నగర్

ఏడుగురికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

jupally 14

అనారోగ్యంతో ఇబ్బందిపడుతూ సాయం కోసం ఎదురు చూస్తున్న ఏడుగురికి సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ లో పంపిణీ చేశారు. కొల్లాపూర్ పట్టణంలో ని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన చెక్కులను పంపిణీ చేశారు.

మొత్తం ఏడుగురు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరందరికి సిఎం సహాయ నిధి నుంచి సాయం కావాలని మాజీ మంత్రి జూపల్లి కోరారు. దాంతో సిఎం కార్యాలయం చెక్కులను పంపింది. వీటిని ఆయన నేడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా అనారోగ్యంతో బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ప్రజలు ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బందులకు గురవకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయనిది అందేలా కృషి చేస్తానని తెలిపారు. నేడు చెక్కులు అందుకున్నవారి వివరాలు: కుడికిళ్ళ కు చెందిన వెంకట స్వామి కి రూ.60 వేలు, నారాయణ పల్లి కి చెందిన కురుమయ్య కు రూ.26,000, వీపనగండ్ల కు చెందిన ఆంజనేయులు కు రూ. 20000 అందచేశారు.

 అదే విధంగా చుక్కాయపల్లి కాలని కి చెందిన బాలస్వామి కి రూ.18000, కొల్లాపూర్ కు చెందిన షకీనాబీ కి రూ.21500, కల్వకోల్ కు చెందిన రాముడు కు.రూ. 14000, కుడికిళ్ళ కు చెందిన వెంకటస్వామి కి రూ. 44000 మంజూరు చేయించడం జరిగింది.

Related posts

వైసీపీ పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు ధ్వజం

mamatha

“కంఠంనేని” కెరీర్ లో మరో కలికితురాయి!

Satyam NEWS

అరసవల్లి సూర్యనారాయణుడిని తాకిన సూర్య కిరణాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!