42.2 C
Hyderabad
May 3, 2024 17: 51 PM
Slider పశ్చిమగోదావరి

పెదవేగిలో మహిళలకు ఘన సన్మానం

#womensday

ఈ సృష్టిలో ఆడ జన్మ అపురూపమైనది. మహిళ లేనిదే ఈ లోకం లో మరో మనిషికి జన్మ లేదు. ఆకాశమే హద్దుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుని, ఆకాశం లో ఎగిరే విమానానానికి పైలెట్ గా, చంద్ర మండలంలో అడుగు పెట్టి వ్యవసాయ పరిశోధనలో ఒక ఇంజినీర్ గా, డాక్టర్ గా, యాక్టర్ గా, ఉపాధ్యాయురాలుగా దేశాన్ని కాపాడే సైనికురాలిగా సాటి మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించే పోలీస్ అధికారిగా న్యాయాన్ని కాపాడే ఒక జడ్జి గా కుటుంబాన్ని పోషించడానికి పురుషుడితో సమానంగా పనిచేసే ఒక  ఉద్యోగిగా, చివరకు వ్యవసాయ కార్మికురాలుగా ఉండేది ఒక మహిళే.

ఒక భర్తకు భార్యగా, పిల్లలను సన్మార్గం లో పెంచి పోషించే ఒక అమ్మగా చెల్లిగా తల్లిగా అత్తగా వృద్ధురాలుగా ఇలా ఎన్నో రూపాలలో కుటుంబానికి, సమాజానికి ఎనలేని వేళా కట్టలేని సేవలందిస్తున్న మహిళలను గర్హిస్తూ ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భం గా ఏలూరు జిల్లా పెదవేగి మండల పరిషత్ కార్యాలయం లో ఎం పి పి తా తా రమ్య అధ్యక్షతన ఎం పి డి ఓ పలువురు మహిళలను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఈ ఏడాది డిజిటల్ జెండర్ ఈక్వాలిటీ అంశంగా లింగ సమానత్వం గురించి వివరించారు. ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చెల్లించండి అంటూ మహిళలతో ఎం పి డి ఓ రాజ్ మనోజ్ మహిళా దినోత్సవం సందర్భంగా నినాదాలు చేయించారు.

Related posts

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం

Satyam NEWS

భూత్పూర్ మునిసిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు

Satyam NEWS

Leave a Comment