తన తండ్రి వంగవీటి మోహన్ రంగా పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి ఆత్మార్పణ చేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధ అన్నారు. శనివారంనాడు నరసరావుపేట పట్టణంలోని కోట సెంటర్ లో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలును ముందుకు తీసుకువెతున్న ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలియజేశారు. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి వంగవీటి రంగా వర్ధంతి, జయంతి కార్యక్రమాలను క్రమం తప్పకుడా కొనసాగిస్తున్న ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు.
అవసరం అయిన సమయంలో రాధ రంగా మిత్ర మండలి సభ్యులు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అలెగ్జాండర్, గూడూరు నరసింహారావు, ఆనంద్, రాయల శ్రీనివాస్ రావు, కసా ఆంజనేయులు, అల్లంశెట్టి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.