27.7 C
Hyderabad
May 7, 2024 08: 48 AM
Slider విజయనగరం

కలెక్టర్ ఆదేశాలు… డీఆర్ఓ ఆచరణ…ఫలితం.. కలెక్టరేట్ ప్రాంగణం ఆధునికీకరణ

#vija

“దేవుడు శాసించాడు…అరుణాచలం పాటిస్తాడు”…అన్న విధంగా దాదాపు రెండు న్నరేళ్లుగా ఉన్న సమస్య కు శాశ్వత పరిష్కారం చూపారు… ప్రస్తుత కలెక్టర్, డీఆర్ఓ, కలెక్టరేట్ ఏఓ ,ఆర్ అండ్ బీ.విజయనగరం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణపు బయట… ఉన్న రోడ్ కు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

అదీ కలెక్టర్ సూర్య కుమారీ ఆదేశాలు… డీఆర్ఓ సూచనలతో..ఏఓ పర్యవేక్షణలో… ఆర్ అండ్ బీ అధికారులు ప్రణాళికతో…26 లక్షల తో సరికొత్త రోడ్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల21న కలెక్టరేట్ కార్యాలయపు పని వేళల్లో ఈ ఆధునికీకరణ పనులకు ఉపక్రమించారు… అధికారులు. అదే రోజు పనుల ప్రారంభానికి కలెక్టర్ సిధ్ధమైనా..వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో కలెక్టర్ సూచనలతో డీఆర్ఓ గణపతిరావు…ఆర్ అండ్ బీ అధికారి నందన్ కుమార్ లతో పనులకు శంఖుస్థాపన జరిగింది.

ప్రతీ సోమవారం జరుగుతున్న “స్పందన” కు…వర్షం పడిన సందర్భంలో ప్రతి ఒక్కరూ నిలవ ఉండిపోయిన వర్షపు నీటిలో ఈదుకుంటూ రావడం…దాన్ని మీడియా హైలైట్ చేయడం పరిపాటి అయ్యిపోయింది.అయితే ఇటీవల కలెక్టరేట్ అడ్మనిస్ట్రేట్ మారడం…అదే సమయంలో సమస్య ను కలెక్టరేట్ దృష్టిలో  సదరు ఏఓ పెట్టడం తో వెంటనే కలెక్టర్ సూర్య కుమారి…స్పందించి..ఆర్.అండ్ .బీ అధికారులను పిలిపించి.. ఆధునికీకరణ పనులకు అంచనా వేయడం.. దాన్ని సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా ఆమోదించేలా..చేయడం తో…దాదాపు 25 లక్షల తో ప్రాంగణం చుట్టూ తారు రోడ్ వేసేందుకు సిధ్ధమవడమే కాకుండా పనులు కూడా చకచకా మొదలయ్యాయి.

ఈ పనులపై డీఆర్ఓ గణపతి రావు సత్యం న్యూస్. నెట్ ప్రతినిధితో మాట్లాడుతూ.. ప్రతీ సారి వర్షాకాలంలో కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే వాళ్ళు పడుతున్న అవస్థలకు ఓ శాశ్వత మైన పరిష్కార మార్గాన్ని కలెక్టర్ చూపారని…దాని ఫలితమే… కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ తారు రోడ్ వేస్తున్నట్లు తెలిపారు. ఆర్.అండ్. బీ శాఖ అధికారులతో అండర్ డ్రైనేజీ తో కొత్త రోడ్ పనులు జరుగుతున్నాయని డీఆర్ఓ తెలిపారు.

ఇదే అంశంపై కలెక్టరేట్ పరిపాలనా అధికారి దేవీ ప్రసాద్ కూడా… మాట్లాడారు. ఎన్నో ఏళ్ల కలకు శాశ్వత పరిష్కారాన్ని కలెక్టర్ కనుగొన్నారని…ఇక నిల్వ ఉన్న వర్షపు నీటికి పరిష్కారం శాశ్వతంగా జరుగుతున్న పనుల ద్వారా లభిస్తుందన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ఆర్టీసీ సమ్మెపై మరిన్ని కఠిన చర్యలు

Satyam NEWS

కనకదుర్గ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం విషాదాంతం

Satyam NEWS

తూర్పుగోదావరి జిల్లా తాటిపాక స్కూల్లో కరోనా కల్లోలం

Satyam NEWS

Leave a Comment