40.2 C
Hyderabad
May 1, 2024 18: 14 PM
Slider మహబూబ్ నగర్

ప్రధానమంత్రి మోడీ పర్యటనను వ్యతిరేకించండి

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తున్న పేరుతో ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి రావడాని వ్యతిరేకిస్తున్నట్లు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (USFI) నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కలమూరి పరుశురాం తెలిపారు.

దేశ సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ దేశ రైతాంగని మొత్తం కూడా దివాలా తీసే చట్టాలు తీసుకొచ్చిన మోడీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఏ విధంగా జాతికి అంకితం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఒకపక్క రైతాంగ నడ్డి విరుస్తూ రైతుల కండ్లల్లో కారం కొడుతూ మళ్లీ రైతులకు ఏదో న్యాయం చేసినట్టుగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. అలాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు పలికిన మోడీ నేడు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

దేశంలో అందరికీ విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చిన బిజెపి ప్రభుత్వం దాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రాల హక్కులను కలరాస్తున్న బిజెపి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి వచ్చి ఏం ఒరగపెడుతుందని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా 20 వేలకు పై పాఠశాలలు మూతపడితే వాటిపై కనీసం స్పందించని మోడీ నేడు ఓట్ల రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు .కాబట్టి మోడీ పర్యటన రోజు రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపడతామని పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

Related posts

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రి వర్గం

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర పతి పాలన విధించాలి

Satyam NEWS

వైఎస్సార్సీపీ నేత పలాస పులి రాజుకు తీవ్ర అవమానం…!

Satyam NEWS

Leave a Comment