24.7 C
Hyderabad
March 26, 2025 09: 58 AM
Slider ఆదిలాబాద్

శాస్త్రీయ దృక్పథంతోనే పంటలను సాగు చేయాలి

#KCR Video Confarence

నియంత్రిత పంటల సాగు విధానంతో రైతులు లాభసాటి పంటలు పండించుకునేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా కలెక్టర్లులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు,  వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, ఉద్యానవన శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర వ్యవసాయ విధానంపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ దృక్పథంతో పంటలను సాగు చేయాలన్నారు. పంటల సాగు విధానంలో మార్పు రావాలన్నారు. పంటల సరళి, వివిధ రకాల పంటల కాలనీలు గా విభజన జరగాలన్నారు. అద్భుతమైన నేల కలిగిన మన రాష్ట్రం లో అత్యధికంగా విత్తనాలను ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు విత్తనాలను సరఫరా చేస్తుందన్నారు.

రైతులకు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత

గతంలో ఏ పంట ఎక్కడ వేయాలని చెప్పలేదన్నారు. రాష్ట్రంలో 2604 క్లస్టర్లు ఉన్నాయని వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతుబంధు పెద్దలు అప్రమత్తంగా ఉండి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు రాజు చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.

రైతులు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రైతుబంధు రైతు బీమా ఉచిత కరెంటు రుణమాఫీ సకాలంలో విత్తనాల సరఫరా చేస్తుందన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం నగరంలోనే కొనుగోలు చేశామన్నారు. రైతులు ముఖ్యంగా ప్రధాన పంటలు లైన పతి మొక్కజొన్న వరి పంటలను పండిస్తున్నారు.

వానాకాలంలో మొక్కజొన్న పంట వేయవద్దు

పంటల సరళి మారాలి మారాలని, వివిధ రకాల పంటల కాలనీలు గా విభజన విభజన జరగాలన్నారు. వాన కాలంలో మొక్కజొన్న పంట వేయొద్దు అన్నారు. ఆరు నెలల్లోగా రైతు వేదిక నిర్మాణం జరగాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి ఇప్పటివరకు ఎన్ని రైతు వేదిక నిర్మాణం జరిగింది, ఇంకా ఎన్ని రైతు వేదికలకు భూమి సేకరించవలసి ఉంది తదితర వివరాలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

నిర్దేశించిన పంటలను సాగు చేసేలా జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నందున మే మాసం లోనే రైతులు ఎరువులు కొనేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు విత్తనాల కంపెనీల డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి వరి విత్తనాల అమ్మకాలపై నియంత్రణ చేపట్టాలన్నారు.

పంటల మార్పిడి తప్పని సరి

రైతు బంధు పథకం అందరికీ అందేలా చూడాలన్నారు. ఎక్కడ పత్తి వేయాలి, ఎక్కడ వరి, ఎక్కడ పప్పుదినుసులు, కూరగాయలు, సోయా, మిర్చి, పసుపు వేయాలో  కార్యచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ నల్ల వెంకట్రాంరెడ్డి పాల్గొన్నారు.

ఇంకా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ కుమార్, జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, సహాయ సంచాలకులు కోటేశ్వరరావు, మహమ్మద్ ఇబ్రహీం హనీఫ్, ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ నదీమ్ ఖాన్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

పనులు చేయకుండానే.. రూ.100 కోట్ల బిల్లులు డ్రా చేశారు.

Satyam NEWS

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డికి పోలీసు అధికారుల వత్తాసు

Satyam NEWS

లక్ష్మణ్ కు వినతిపత్రం అందజేత

Satyam NEWS

Leave a Comment