39.2 C
Hyderabad
April 28, 2024 13: 01 PM
Slider కడప

జగన్ రెడ్డి పాలనలో కన్నీరు కారుస్తున్న ఆంధ్రప్రదేశ్

జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ కారుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప టీడీపీ ప్రెసిడెంట్ రెడ్డప్పగారి శ్రీనివాసులుపెడ్డి అన్నారు. కేన్సాస్ నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 7వ మహానాడు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలు, ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప టీడీపీ ప్రెసిడెంట్ రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం కన్నీరు కారుస్తోంది. ప్రవాసాంధ్రులు స్పందించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ప్రతిఒక్కరు మేల్కోవాలి. చంద్రబాబు ని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం నడుం బిగించాలి. విధ్వంసం పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఆర్థికంగా రాష్ట్రం అథపాతాళంలోకి వెళ్లింది. జగన్ ఆర్థికంగా పరిపుష్టి చెంది.. రాష్ట్రాన్ని అంథకారంలోకి తీసుకెళ్లారు. ప్రతి కార్యక్రమానికి తన పేరు, తన తండ్రి పేరు పెట్టుకునే ఉత్సాహం అభివృద్ధిలో మాత్రం లేదు. చివరకు శ్మశానాలకు కూడా తండ్రి పేరు పెట్టుకుంటారేమో అని అన్నారు.

జయరాం కోమటి మాట్లాడుతూ జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన శని. జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన శనిని త్వరగా వదిలించుకోవాలి. రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి కేసుల నుంచి బయటపడటానికి ప్రధాని కాళ్లు పట్టుకున్నారు. జగన్ రెడ్డి ఉన్నంత కాలం ప్రవాసాంధ్రులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు అని అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఎవరికీ రక్షణలేని పరిస్థితి. పోలీసులు, నేరస్థులు కలిసి పనిచేస్తున్నారని సాక్షాత్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపైన, జగన్మోహన్ రెడ్డిపైన సొంత చెల్లిలే విశ్వాసం కోల్పోయింది. వివేకానందరెడ్డి హత్యకేసును పక్కరాష్ట్రానికి బదిలీచేయమనడమే దీనికి నిదర్శనం. నేరస్థుల పాలనలో అరాచకం ప్రబలిపోయింది అని అన్నారు.

ఎన్టీఆర్ మనవరాలు మనస్విని కంభంపాటి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా క్రమశిక్షణతో జీవించారు. ఆయన మనవరాలిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, లక్ష్మీ నాయుడు వెలకటూరి, కేన్సాస్ స్టేట్ ఎన్ఆర్ ప్రెసిడెంట్ రావు ద్రోణవల్లి, వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కొమ్మినేని, జనరల్ సెక్రటరీ వెంకట్ నల్లూరి, ట్రెజరర్ గౌతమ్ నల్లూరి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రవల్లిక వట్టెం, యూత్ కో ఆర్డినేటర్ రతన్ కొమ్మినేనితో పాటు కనీవినీఎరుగని రీతిలో పెద్దఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Related posts

ప్రాబ్లెమ్:మానేరు నిండా నీరు నీటి కోసం బోరు బోరు

Satyam NEWS

కొన్ని ప్రాంతాల నుంచి రష్యన్ సేనల ఉపసంహరణ

Bhavani

కళాతపస్వి కె. విశ్వనాథ్ మహాభినిష్క్రమణం

Satyam NEWS

Leave a Comment