32.2 C
Hyderabad
May 2, 2024 02: 54 AM
Slider విజయనగరం

గిరి శిఖర గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్

#vijayanagaram police

విజయనగరం జిల్లాలో గిరిజనులకు అండగా పోలీసుశాఖ ఎల్లప్పుడూ ఉంటుందని, మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితులు కావద్దని, ప్రభుత్వం చేపట్టే అభివృద్ధికి దూరం కావద్దని  ఎస్పీ రాజకుమారి పిలుపు నిచ్చారు. జిల్లాల‌తోని మక్కువ మండలం గిరి శిఖర గ్రామమైన తాడిపుట్టి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు.

మహిళల ప్రభుత్వం పోలీసులు కట్టుబడి ఉందని, ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్ లో దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఆపద సమయాల్లో SOS బటన్ ప్రెస్ చేసి, పోలీసుల సహాయం పొందాలన్నారు. మారుమూల గిరి శిఖర గ్రామమైన తాడిపుట్టి గ్రామంలో గిరిజన యువతుల మొబైల్ ఫోనుల్లో దిశా మొబైల్ యాప్ లను ఎం ఎస్ పిల సహాయంతో జిల్లా ఎస్పీ డౌన్ లోడ్ చేయించి, యాప్ వినియోగించే విధానం గురించి అవగాహన కల్పించారు.

బాల్య వివాహాలు చెయ్యొద్దని,  పిల్లలను బాగా చదివించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగులో భాగంగా గిరిజనులతో జిల్లా ఎస్పీ మమేకమై, వారి సాధక, బాధలను అడిగి తెలుసుకున్నారు.

దాదాపు వెయ్య మంది గిరిజనులకు పోలీసుశాఖ భోజనాలు ఏర్పాటు చేసింది.  అంత‌కుముందు ఎగువ మేండంగి గ్రామం వద్ద గిరిజన మహిళలు దింశా నృత్యంతో   ఎస్పీ రాజకుమారికి స్వాగతం పలికారు. ఈ రహదారి నిర్మాణం వలన ఎగువ మండంగి, తాడిపుట్టి, డోహివర, సిరివర, పోయిమల, బెలుగొండ గ్రామ ప్రజలకు రహదారి సౌకర్యం ఏర్పడి, ఆరు గ్రామాల మధ్య రాక, పోకలు సులువుగా మారాయన్నారు.

దీని వలన గిరి శిఖర గ్రామాల్లో నివసించే 1500మంది గిరిజనులకు లబ్ధి చేకూరి, డోలీ బాధలు తప్పి, వైద్య సౌకర్యం సులువుగా పొందేందుకు దుగ్గేరు, మక్కువ ప్రాంతాలకు రాక, పోకలు సులభతరం అవుతాయన్నారు. ఎన్నో ఏళ్ళుగా గిరి శిఖర గ్రామాల కలగా మిగిలిన ఈ రహదారి నిర్మాణం పోలీసులు, స్థానిక గిరిజనుల సంయుక్త శ్రమదానంతో సాధ్యమైందని, ఎన్నో ఏళ్ళ గిరిజనుల కల సాకారం అయ్యిందని గిరిజనులు జిల్లా ఎస్పీ రాజకుమారికి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం జిల్లా ఎస్పీ బాగుజోల, చిలక మెండంగి గ్రామాలను జిల్లా ఎస్పీ సందర్శించి, గిరిజనుల పిల్లలకు బిస్కెట్ పెకెట్లు ఇతర తిను బండారాలను జిల్లా ఎస్పీ అందజేసి, వారి ఆరోగ్య స్థితిగతుల గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, వారిని ఉన్నత చదువులు చదివించాలని అన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్

Related posts

కోవిడ్ పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

Satyam NEWS

జగన్ పాలన లో సంక్షోభంలో పడ్డ సంక్షేమం

Satyam NEWS

విషవాయువు లీకేజీ విచారణకు కేంద్ర కమిటీ

Satyam NEWS

Leave a Comment