32.2 C
Hyderabad
May 1, 2024 23: 14 PM
Slider జాతీయం

రిలయన్స్‌ జియోకు ట్రిబ్యునల్‌లో కొంత ఊరట

reliance jio

రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఆప్టికల్‌ ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను వేరు చేయడాన్ని (డీమెర్జర్‌) వ్యతిరేకిస్తూ ఆదాయపన్ను శాఖ దాఖలు చేసిన పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. జియో ఫైబర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, రిలయన్స్‌ జియో ఇన్ఫ్రాటెల్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ తన ఫైబర్‌, టవర్‌ వేరుచేయాలని నిర్ణయించుకుంది.

ఇందుకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ అహ్మదబాద్‌ బెంచ్‌ అనుమతి చేసింది. దీనిపై ఆదాయపన్ను శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. డీమెర్జర్‌ ప్రకారం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ రెడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను రుణాలుగా మార్చాల్సి ఉంటుంది. ఈక్విటీని డెట్‌గా మార్చడం అన్నది కంపెనీ లా సుత్రాలకు వ్యతిరేకం. అంతేకాదు బదిలీ కంపెనీ (జియో ఇన్ఫోకామ్‌) లాభదాయక లేదా నికర ఆదాయం తగ్గిపోతుంది. ఇది ఆదాయపన్ను విభాగానికి ఆదాయ నష్టాన్ని కలిగిస్తుందని ఆదాయపన్ను శాఖ వాదించింది.

Related posts

కరోనా బాధిత కుటుంబాల పిల్లల సంరక్షణ సహాయక కేంద్రం

Satyam NEWS

పొగ మంచులో ప్రయాణం ప్రమాదకరం

Bhavani

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళుతున్నారు?

Satyam NEWS

Leave a Comment