28.7 C
Hyderabad
April 28, 2024 06: 08 AM
Slider కడప

ఆరోగ్య సిబ్బందిని వేధిస్తున్నపిహెచ్ సి డాక్టర్

#KadapaPHC

ఆరోగ్య సిబ్బంది అందరూ టెన్షన్ లోనే ఉన్నారు. కరోనా కాలంలో అందరూ విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. ఈ సమయంలో వైద్యాధికారులు కింది స్థాయి వారితో ఎలా ప్రవర్తించాలి? మానవతా దృక్పదంతో ఉంటే ఎంత పని వత్తిడి ఉన్నా పని చేసుకుంటూనే వెళతారు.

అయితే ఒక డాక్టర్ పెట్టే చిత్ర హింసలతో కింది స్థాయి ఆరోగ్య కార్యకర్త కన్నీటి పర్యంతం అయింది. కడప జిల్లా వేంపల్లె మండల పరిధిలోని తాళ్లపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ స్వాతి సాయి వేధింపులకు తట్టుకోలేక వేంపల్లె 1 సబ్ సెంటర్ రమణమ్మ కన్నీరు పెట్టుకుంది.

అనవసరంగా కారణం లేకుండా అందరి ముందు తిడుతోందని ఆమె ఆరోపించింది. వ్యాక్సిన్ ను అనర్హులకు వేయమని మెసేజులు పెట్టిందని ఆమె ఆరోపించారు. మండల పరిధిలోని గ్రామా పొలాల్లో వ్యాక్సిన్ ను బయట వ్యక్తులకు అందజేసిందని ఆమె ఆరోపించారు.

వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటానని ఆమె చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు అడిగేందుకు డాక్టర్ వద్దకు వెళ్లగా  కారులో కూర్చుని ఎంతసేపటికీ దిగలేదు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి డాక్టర్ స్వాతి సాయి పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Related posts

పేదలకు అన్నదానంతో పుట్టిన వేడుకలు

Satyam NEWS

2021

Satyam NEWS

లాక్ డౌన్ తో వేములవాడ దేవాలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment