Slider కడప

సామాజిక వర్గం పేరుతో విమర్శలు చేయడం జగన్ కు తగదు

bhatyala 15

ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ను సామాజిక వర్గం పేరుతో దూషించడం తగదని మాజీ ఎమ్మెల్సీ  బత్యాల చంగల్ రాయుడు అన్నారు. కడప జిల్లా కోడూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థని గతంలో మీరు కూడా శాసనసభ ఎన్నికల సందర్భంగా అప్పటి ఎలక్షన్ కమిషనర్ పై ఫిర్యాదు చేశారని, అప్పుడు మంచి అయిన ఎలక్షన్ కమిషన్ తీరు ఈరోజు చెడ్డదైనదా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలో మీరు చేస్తున్న అరాచక, అనైతిక, దుర్మార్గమైన పనులను ప్రకృతి కూడా సహించలేక కరోన రూపంలో ఎన్నికలను వాయిదా వేయడం జరిగిందన్నారు. కాబట్టి మంచి పనులు మాత్రమే భగవంతుడు స్వాగతిస్తాడని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అరాచక పాలన ఆపి మంచి వైపు పయనించండని జగన్మోహన్ రెడ్డి కి హితబోధ చేశారు.

 కోడూరులో స్థానిక సంస్థల నామినేషన్ సందర్భంగా జరిగిన బీభత్సకాండకు సంబంధించిన అన్నిరకాల వీడియో క్లిప్ లతో పాటూ, పోలీసులు, అధికారుల తీరుపై సోమవారం ఆంధ్రప్రదేశ్ చీప్ ఎలక్షన్ కమిషన్ ను కలిసి  ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.

అలాగే అధికార పార్టీ వారికి తొత్తులుగా వ్యవహరించిన అధికారులపై హైకోర్టులో ఆశ్రయించ నున్నామని తెలిపారు. ఆయనతో  పాటు ఈ సమావేశంలో మాజీ ఉపసర్పంచ్ నార్జల హేమరాజ్, చంగల్ రెడ్డి, ఈశ్వరయ్య, చియ్యవరం సుబ్బరాయుడు, పోతురాజు నవీన్ కుమార్, పుణురంగన్ గౌడ్, కస్తూరి సుధాకర్, బాలసుబ్రహ్మణ్యం, అంకిపల్లి భువనేశ్వర్, శ్రీకారపు శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

ట్రాఫిక్ పోలీసుల ఆదేశాల‌ను పెడ‌చెవిన పెడుతున్న ప్ర‌జానీకం…!

Satyam NEWS

ప్రేమా వర్ధిల్లు

Satyam NEWS

లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళా టీచర్ మృతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!