40.2 C
Hyderabad
May 2, 2024 15: 14 PM
Slider కడప

అక్రమాల ఏకగ్రీవాల పై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

bjp kadapa

స్థానిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అక్రమాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకుందని, వెంటనే వాటిని రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర బీజేవైయం అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు.

కడప జిల్లా రాజంపేటలోని స్థానిక బిజెపి కార్యాలయంలో శనివారం జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ పరిధిలోని వీరపల్లి మండలంలో మట్టి ఎంపీటీసీ అభ్యర్థిగా బిజెపి తరపున పోటీ చేసిన రావూరి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం అభినందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థలు ఎన్నికలలో బీజేపీ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులను బెదిరించి బలవంతంగా విత్ డ్రా చేసిన స్థానాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల ను వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నాం. వ్యవస్థ లో లోపాలు ఉంటే ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ఎన్నికల వాయిదాను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక కోణం లో చూడడం తగదన్నారు.

ఇంకా ఎన్ని రోజులు సామాజిక కోణంలో రాజకీయాలు నడుపుతారని ప్రశ్నించారు. కరోనా పై దేశాలు రాష్ట్రాలు ఎలా యుద్దం చేస్తున్నాయో బీజేపీ పార్టీ వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఏకగ్రీవాల పేరిట వైసీపీ చేసిన అక్రమాలను ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరు వారాలు తరువాత ఎన్నికలు సజావుగా జరిపించాలి లేని పక్షంలో ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఏ వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో గత టీడీపీ ప్రభుత్వం 5 ఏండ్ల పాలనలో మూట గట్టుకున్న అవినీతిని, వైసీపీ తొమ్మిది నెలల పాలనలో 10 రేట్లు మూటగట్టుకొందని ఆరోపించారు.

బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో ఓర్వలేక వైసీపీ ఇలా స్థానిక ఎన్నికల్లో కుట్రలకు పాల్పడినట్టు ఆరోపించారు. వెంటనే ఏకగ్రీవాలు ను రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తాల రాజేష్ , ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పట్టుపోగుల ఆదినారాయణ ,బీజే వై యం రాష్ట్ర కార్యదర్శి గుణ వర్మ ,బీజేపీ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మొల్లగురి వేణు గోపాల్  తదితరులు పాల్గొన్నారు.

Related posts

డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేశాయ్

Murali Krishna

క్షీరసాగర మథనం: అవాంతరాల హాలాహలం అనంతరమే ఆనందం

Satyam NEWS

బాగ్ అంబర్ పేట్ లో నిత్య జనగణమన కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment