37.2 C
Hyderabad
April 26, 2024 20: 19 PM
Slider నిజామాబాద్

మత్స్యకారుల కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వం

#pocharamsrinivasareddy

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పలు పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరిగిన రూ. 5.47 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలలో నేడు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

30 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే పోలీసు షాపింగ్ కాంప్లెక్స్ (17 మడిగెలు) కు భూమి పూజ నిర్వహించారు. 2 కోట్ల రూపాయలతో బాన్సువాడ నూతన పురపాలక సంఘం భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే MRO భవనానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా 2 కోట్ల రూపాయలతో నూతన వెజ్ నాన్వేజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

67 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఫిష్ మార్కెట్ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ ఉచితంగా చేప విత్తన సరఫరా,  చేపల విక్రయాల కోసం మార్కెట్లు నిర్మాణం, సబ్సిడీపై వాహనాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.

ఇప్పటికే తెలంగాణ   ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతి చేస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని మత్స్య కార్మికులు అందిపుచ్చుకుని బాగుపడాలని, దళారులు, మధ్యవర్తులను దగ్గరకు రానీవద్దని ఆయన అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇళ్ళు లేని పేదవారందరికి స్వంత ఇంటి నిర్మాణం తన ఆశయమని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దయతో బాన్సువాడ నియోజకవర్గానికి పదివేలు ఇళ్ళు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో మరే నియోజకవర్గానికి ఇన్ని ఇళ్ళు మంజూరు కాలేదు. అవసరమైతే మరో అయిదు వేల ఇళ్ళను తీసుకువచ్చి విడతల వారిగా పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇల్లును మంజూరు చేస్తాను. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలను సహించను. అర్హులైన పేదలకు మాత్రమే ఇళ్ళు అందాలి అని స్పీకర్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక బాన్సువాడ పట్టణ అభివృద్ధి కోసం,  పట్టణ ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు, సౌకర్యాల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ  బి. శ్రీనివాస రెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబందు అధ్యక్షుడు అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 జీ లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం

Related posts

జగనన్న ఇళ్లకు లేదు కానీ అక్రమాలకు మాత్రం పుష్కలంగా ఇసుక

Satyam NEWS

ప్రారంభమైన కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పిసి524’

Satyam NEWS

నిద్ర మత్తులో అధికారులు: భారీ వృక్షాలు నరుకుతున్నా చూడరా?

Satyam NEWS

Leave a Comment