38.2 C
Hyderabad
April 29, 2024 12: 56 PM
Slider మహబూబ్ నగర్

నిండిన కుంటలు గండి పడుతున్న కాల్వలు

#Youth Congress

భారీ వర్షానికి వనపర్తి జిల్లా పానగల్ మండలం లోని అన్ని గ్రామాలలో చెరువులు, కుంటలు నిండి అలుగు పోవడం వల్ల రైతులు సంతోషపడాలో లేదో అర్ధం కావడం లేదు. చెరువులకు కుంటలకు ఉన్న పాటు కాలువలు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పూడుకొని పోవడంతో నీరు పంట పొలాలలో చేరి పంట కోతలకు గురి కావాల్సి వచ్చింది.

అంతే కాక భీమా, కెఎల్ఐ కాలువలను నాణ్యతతో చేయించకపోవడం, డిస్ట్రిబ్యూటరి లేకపోవడం వంటి రకరకాల ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయలు నష్టపోతున్న రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

కోతలకు గురైన పంటలను,తెగిన కాలువలను, గ్రామాలలో పాటు కాలువలు దగ్గర ఉన్న సమస్యలను అధికారులు స్వయంగా పరిశీలించి వాటికి తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని, మండలం లోని అన్ని గ్రామాలలో నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

ఈ పత్రికా సమావేశం లో   పానగల్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బుసిరెడ్డిపల్లి కృష్ణ,  నగేష్ నాయక్, ఇర్షాద్, అఖిల్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Satyam NEWS

మసీదు నిర్మాణానికి వేరే చోట 5 ఎకరాల చోటు

Satyam NEWS

సీఎం గారూ…ఎస్సీ, ఎస్టీలకు నోట్లో మట్టికొడతారా..?

Satyam NEWS

Leave a Comment