26.7 C
Hyderabad
May 3, 2024 10: 29 AM
Slider ముఖ్యంశాలు

డిమాండ్: మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి

dasoju shravan

అవినీతి ఆరోపణలు వస్తే తన స్వంత కొడుకునైనా ఉపేక్షించనన్న సీఎం కేసీఆర్ ఎన్నికల్లో అవినీతికి పాల్పడుతున్న మంత్రులను ఎందుకు సస్పెండ్ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రాజకీయం అంటే పచ్చి పెట్టుబడి వ్యాపారంగా టిఆర్ఎస్ నాయకులు మార్చేశారని ఆయన ధ్వజమెత్తారు.

ఏ మాత్రం సిగ్గులేకుండా నోట్లు ఖర్చు పెట్టి ఓట్లు వేయించు కుంటామనే దుర్మార్గమైన సంస్కృతికి టిఆర్ఎస్ నాయకులు శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు. మంత్రులు మల్లా రెడ్డి, దయాకర్ రావులు మునిసిపల్ ఎన్నికలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శ్రవణ్ అన్నారు. రెండు రోజుల కిందట మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి , భద్రారెడ్డి అనే వ్యక్తితో కలిసి బొమ్మాకు మురళి అనే నాయకుడితో మునిసిపల్ ఎన్నికలలో సీటు కోసం 50 లక్షలు ఇవ్వాలంటూ బేరాలాడిన ఆడియో టేపులన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని దాసోజు వెల్లడించారు.

అలాగే మీరు ఓట్లు ఎవరికి వేస్తారో తెలుస్తుందంటూ ఓటర్లను బెదిరిస్తూ,  బ్లాక్ మెయిల్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్పడుతున్నారని ఆరోపించారు. సీట్లు ఇవ్వడానికి ఒక్కో టికెట్ కు 50 లక్షల నుంచి కోటి దాకా వసూలు చేస్తున్నట్లు మల్లారెడ్డి ఆడియో టేపుల ద్వారా వెల్లడైందన్నారు. ప్రీవెన్షన్ ఆఫ్ అవినీతి చట్టం కింద మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేయాలని, సుమోటోగా పోలీసులు, ఏసీబీ విచారణకు స్వీకరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎసిబి, పోలీసులకు, ఎన్నికల కమిషన్ కు కేసు ఫైల్ చేస్తామన్నారు.

Related posts

తిరుమల భక్తులపై భారం వేయడం తగదు

Bhavani

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి: రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు సీఎం జ‌గ‌న్ పెద్ద పీట‌…!

Satyam NEWS

Leave a Comment