28.7 C
Hyderabad
April 27, 2024 06: 20 AM
Slider ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు హాండ్ ఇచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలు

chandraba

టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అయితే పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని విప్ జారీ చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు టీడీఎల్పీ సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. ఈ కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. గంటా శ్రీనివాసరావు, వాసుపల్లి గణేశ్, అశోక్, అనగాని భవాని హాజరుకాలేదు.

వ్యక్తిగత కారణాలతో సమావేశానికి రాలేకపోతున్నామని పార్టీకి సందేశం పంపారు. ఈ భేటీకి గైర్హాజరైన ఐదుగురు ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున, పార్టీ ఆదేశానుసారం ఓటేయాలని టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. విప్ పరిధిలోకి రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలను కూడా తీసుకువచ్చారు. విప్ కు విరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది.

Related posts

కాషాయ కండువా కప్పుకున్న మోత్కుపల్లి

Satyam NEWS

హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన శాసనసభ్యుడు

Satyam NEWS

ఎమ్మెల్యేకు, పోలీసులకు మాజీ మంత్రి జూపల్లి వార్నింగ్

Satyam NEWS

Leave a Comment