38.2 C
Hyderabad
May 5, 2024 20: 54 PM
Slider జాతీయం

మధ్యప్రదేశ్ లో బిజెపి విజయానికి బ్రేక్ కొట్టిన కాంగ్రెస్

#madhyapradesh

2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్‌లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికారానికి సెమీఫైనల్‌గా చెప్పుకునే అర్బన్‌ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పనితీరు గతం కంటే మెరుగ్గా కనిపించింది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో గ్వాలియర్‌లో రాజకీయం అతిపెద్ద మలుపు తిరిగింది. గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ బిజెపికి కంచుకోటగా ఇంతకాలం ఉండేది.

కానీ ఈసారి ఇక్కడ ఆ పార్టీ మ్యాజిక్ పనిచేయ లేదు. గ్వాలియర్‌లో సింధియా కుటుంబం పూర్తిగా బీజేపీలో ఉన్నప్పటికి, 57 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నది. నిజానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీదే ఆధిపత్యం. ఈసారి సింధియా బీజేపీతో కలిసి ఉండగా, కాంగ్రెస్ ఇక్కడ పాగా వేసింది.

ఆదివారం నాటి ఫలితాల ప్రకారం 11 మునిసిపల్ కార్పొరేషన్లలో 7 బిజెపి మేయర్‌ స్థానాన్ని దక్కించుకోగా మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కంచుకోట అయిన జబల్‌పూర్, గ్వాలియర్ మరియు చింద్వారాలో కాంగ్రెస్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో మొదటిసారిగా బిజెపి కాంగ్రెస్ కాకుండా మూడో పార్టీ మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించింది.

సింగ్రౌలీ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఇది కాకుండా, అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM కౌన్సిలర్ కూడా ఎన్నికల్లో విజయం సాధించాడు. జూలై 20న జరిగే రెండో విడతలో 5 మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు రావాల్సి ఉంది.

రాష్ట్ర రాజధాని భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, సత్నా, బుర్హాన్‌పూర్, ఖాండ్వా మరియు సాగర్‌లను బీజేపీ కైవసం చేసుకోగా, చింద్వారా, జబల్‌పూర్ మరియు గ్వాలియర్‌లలో ఆ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. కమల్‌నాథ్‌కు కంచుకోట అయిన చింద్వారాలో 18 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పునరాగమనం చేసింది. కమల్ నాథ్ తనయుడు, ఎంపీ నకుల్ నాథ్ ఇక్కడ యాక్టివ్‌గా ఉన్నారు. మహాకౌశల్ ఏరియాలో బీజేపీకి అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి బీజేపీ జబల్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కోల్పోయింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా జబల్‌పూర్‌లో అత్తమామల ఇల్లు ఉంది. మునిసిపల్ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆయన జబల్‌పూర్‌లో రోడ్ షో చేశారు. అయినప్పటికీ బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. దీంతో పాటు సింగ్రౌలీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ, కాంగ్రెస్‌లకు ఘోర పరాజయాన్ని అందించింది. ఇక్కడ నుంచి ఆప్ మేయర్ అభ్యర్థి రాణి అగర్వాల్ విజయం సాధించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సింగ్రౌలీకి ప్రచారం చేశారు.  మునిసిపల్ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బిజెపి ఎక్కువ నష్టపోయిందని చెప్పవచ్చు. భోపాల్-ఇండోర్ వంటి బలమైన కోటను బీజేపీ కాపాడుకోగలిగింది.

గతసారి బీజేపీ 16 మున్సిపల్ కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. ఈసారి చాలా ముఖ్యమైన కార్పొరేషన్‌లు కోల్పోయింది. ఉజ్జయిని, బుర్హాన్‌పూర్‌లలో విజయం కోసం బీజేపీ కష్టపడాల్సి వచ్చింది. గ్వాలియర్‌లో కాంగ్రెస్ గెలుపు ప్రభావం మొత్తం ప్రాంతంపై కనిపిస్తుంది. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి గట్టిపోటీ తప్పదు. గ్వాలియర్ లో అభ్యర్థి ఎంపిక నుంచే పార్టీలో విభేదాలు కనిపించాయి.

అభ్యర్థి ఎంపికకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలతో స్థానిక నేతలు సుదీర్ఘంగా సమావేశమైనా ఫలితం లేకపోయింది. సింధియా వర్గాన్ని బలహీనపరిచేందుకు స్థానిక నేతలు బ్రాహ్మణ అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు.

అయితే, మాజీ మంత్రి అనూప్ మిశ్రా భార్య శోభా మిశ్రా పేరును ప్రతిపాదించి సింధియా కొత్త రాజకీయానికి తెరతీశారు. చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎంపికపై తోమర్, సింధియా మధ్య పోరు సాగుతున్నట్లు వార్తలు రావడంతో నష్టం జరిగిపోయింది.

జబల్‌పూర్‌లో భాజపా అభ్యర్థిపై స్థానికులలో ఆగ్రహం ఉంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడ మూడు రోడ్ షోలు నిర్వహించడానికి కారణం ఇదే. బూత్ కార్యకర్తల సమావేశంతో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా యువజన సదస్సును కూడా నిర్వహించారు. అయినప్పటికీ బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సింగ్రౌలీలో బీజేపీ కంచుకోటను ఆమ్ ఆద్మీ పార్టీ చేజిక్కించుకుంది.

బీజేపీలో అంతర్గత పోరు, కుల సమీకరణలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. సింగ్రౌలిలో అత్యధిక ఓటర్లు 37 వేల మంది బ్రాహ్మణులు, అయితే బీజేపీ చంద్ర ప్రతాప్ విశ్వకర్మ ను నిలబెట్టింది. ఇది ఈ పెద్ద వర్గానికి కోపం తెప్పించింది. అయితే బ్రాహ్మణులను ఒప్పించేందుకు మాజీ మంత్రి రాజేంద్ర శుక్లా ఇంటింటికీ వెళ్లారు కానీ ఫలితం దక్కలేదు. ఇదిలావుండగా బ్రాహ్మణుల మొగ్గు ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఉంది. బీజేపీ ఓటమిలో ఆప్ అభ్యర్థి రాణి అగర్వాల్ కూడా కీలక పాత్ర పోషించారు. ఆమె బీజేపీకి రాజీనామా చేసి ఆప్‌లో చేరారు.

Related posts

27 న భారత్‌ బంద్‌ ను జయప్రదం చేయాలి: అఖిలపక్షం పిలుపు

Satyam NEWS

విజయనగరం లో రాత్రి పూట జరిగిన ప్రమాదం.. ఎంతమందంటే…!

Satyam NEWS

2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూల‌నే ల‌క్ష్యం

Satyam NEWS

Leave a Comment