39.2 C
Hyderabad
April 28, 2024 11: 22 AM
Slider ముఖ్యంశాలు

27 న భారత్‌ బంద్‌ ను జయప్రదం చేయాలి: అఖిలపక్షం పిలుపు

#allpartymeet

సంయుక్త కిసాన్‌మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్‌ 27 న దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని కాంగ్రెస్‌ ,సిఫిఐ, సిఫిఎం, టీజెఎస్‌, టీడీపి, సీపీఐ ఎం (ఎల్‌ఎన్‌డి) పార్టీల నాయకులు కోరారు. శనివారం ఈసీఐఎల్‌ కమలానగర్‌ లోని సీపీఎం ఆపీసు నందు అఖిలపక్ష పార్టీల నాయకుల సమావేశం జరిగింది.

ఈ సందర్బంగా విలేకర్ల సమావేశంలో టిపిసిసి కార్యదర్శి సిఇంగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి, ఎఐవైఎఫ్‌ నాయకులు ధర్మేంద్ర, సిపిఎం నాయకులు కె.వెంకట్‌, జనసమితి నాయకులు భద్రగామ ఆంజినేయులు, నాయకులు శ్రీనివాస్‌ దేవినేని, పి.శివబాబు, శివరామకృష్ణ, బి,రాఘరెడ్డి, పత్తికుమార్‌, గోపాల్‌యాదవ్‌ ,జె.చంద్రశేఖర్‌, పిఎస్‌ఎన్‌ మూర్తి, శ్రీమన్నారాయణ, శ్రీనివాసులు, ఎం .శ్రీనివాస్‌, గడ్డం యాదగిరి, సత్యస్రాద్‌, ఎంవిఎస్‌విప్రసాద్‌,  జె.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న భారత్‌ బంద్‌ కు కిసాన్‌ మోర్చా పిలుపునివ్వడం జరిగిందన్నారు. దీనిని ప్రజలు , వ్యాపార వాణిజ్య సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. గత 30 ఏళ్లుగా అమలవుతున్న నయా ఉదార వాద విదానాల ఫలితంగా నాలుగు లక్షల మంది రైతుల ఆత్మహత్యకు దారితీసిందన్నారు.

ప్రాధమిక సమస్యగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. పెట్టుబడి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాలని వారు కోరారు. విద్యత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే కార్మికులకు వ్యతిరేకంగా చేసిన నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. ప్రవేటి కరణ నిలుపుదల చేసి బీజేపి పాలకులు దేశాన్ని అమ్మే చర్యలకు అంత పలకాలని కోరారు.

కార్పోరేట్‌ కంపెనీల అనుకూల విధానాలు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సి ఉందన్నారు. ఈ ఉద్యమాలకు పరాకాష్ట డిల్లీ సరిహద్దుల్లో చారిత్రాత్మక రైతు ఉద్యమం గత సంవత్సరం నవంబర్‌ 26 నుండి జరుగుతోందన్నారు. సయుక్త కిసాన్‌ మోర్చా రైతు ఉద్యమం 10 నెలలు కాలం పూర్తవుతోందని, అయనప్పటికి మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. దీనికి నిరసనగా ఈ నెల 27 వ తేదీన జరిగే  దేశవ్యాప్త బంద్‌ను జయప్రదం చేయాలని అఖిల పక్ష పార్టీలు పిలుపునిచ్చారు.

Related posts

ఎస్పీ ముందే రాజీనామా చేస్తాన‌ని ఎమ్మెల్యే స‌వాల్…

Satyam NEWS

కొల్లాపూర్ దళిత కాలనీ అభివృద్ధి కోసం అడుగులు

Satyam NEWS

కిలో బంగారం స్వాధీనం

Sub Editor

Leave a Comment