27.7 C
Hyderabad
April 30, 2024 10: 02 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ముందస్తు అరెస్ట్

#hujurnagar PS

వ్వక్తిగత స్వేచ్ఛను హరించే ఫోన్ టాపింగ్ విషయమై ఎఐసిసి నిర్ణయం మేరకు,తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్ళేందుకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు గురువారం హుజూర్ నగర్ పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అరెస్టు చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన సందర్భంలో ఉదయం స్థానిక పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణి నాయకులు, పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కటం సరియైనది కాదని,దేశ భద్రత కోసం ఉగ్రవాదుల, కరుడుగట్టిన తీవ్రవాదుల కదలికలను తెలుసుకోవటం కొరకు  ఉపయోగించాల్సిన పెగాసస్ స్పైవెర్ నిఘా స్వార్ధం కోసం వ్యక్తులపై,వ్యవస్థపై, రాజకీయ ప్రత్యర్ధులపై, ఉపయోగించటం ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను హరించటమే అవుతుందని, దీనివల్ల వ్యక్తిగత గోప్యత లోపిస్తుందని,ఇది చివరకు ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందని,దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు.   

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాముల శివారెడ్డి, బాచిమంచి గిరిబాబు, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి,తేజావత్ రాజా,వేముల నాగరాజు,దేవరం పాపిరెడ్డి, జక్కుల మల్లయ్య,కోళ్ళపూడి యోహాను, చంటి,కస్తాల దిలీప్,రామిరెడ్డి, ప్రవీణ్,మధు, ముస్తఫా తదితరులు ఉన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కొల్లాపూర్ లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకు కరోనా?

Satyam NEWS

అంబర్ పేట లో లబ్ధిదారులకు బెడ్ రూం ఇండ్ల అందజేత

Satyam NEWS

కోనసీమలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

Satyam NEWS

Leave a Comment