40.2 C
Hyderabad
April 29, 2024 17: 53 PM
Slider నల్గొండ

ఆస్తులు కాపాడలంటూ మున్సిపల్ కమీషనర్ కు వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్లు

#congress

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో గల మున్సిపాల్టీ కి చెందిన స్థలాలకు రక్షణ తీగలు ఏర్పాటు చేసి కాపాడాలని మున్సిపాల్టీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రవణ్ కుమార్ మున్సిపాల్టీ కమీషనర్ శ్రీనివాస రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయనతో బాటు కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి,తేజావత్ రాజా,సరితా వీరారెడ్డి లు టిఆర్ఎస్ పార్టీ బహిష్కృత కౌన్సిలర్ జక్కుల వీరయ్య కూడా ఉన్నారు. మునిసిపల్ ఆస్తుల హద్దులు నిర్ణయించాలని, వాటి విస్తీర్ణం తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా వినతి పత్రం అందజేసిన మున్సిపల్ కౌన్సిలర్లు మాట్లాడుతూ హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో అక్రమ వెంచర్లు వెలిశాయని, అనుమతులు లేకుండా పెట్టిన వెంచర్లను అరికట్టాలని కోరారు.

హుజూర్ నగర్ మున్సిపాల్టీ పరిధిలో లే అవుట్ ద్వారా మున్సిపాల్టీకి వచ్చిన స్థలాలు సర్వే నెంబర్ 449/ఎ విపిఆర్ వెంచర్,సర్వే నెంబర్ 207,208,209, 211,212 ఓపెన్ జిమ్ స్థలాలకు రక్షణ వలయం ఏర్పాటు చేసి మున్సిపాల్టీ లే అవుట్ స్థలాలు అని బోర్డులు పెట్టాలని, వాటిలో విస్తీర్ణంతో పాటు హద్దులు ఉండేలా ఏర్పాటు చేయాలని అన్నారు.

సర్వే నెంబర్ 206 పద్మశాలి కళ్యాణ మండపం పక్కన గల మున్సిపాల్టీ లే అవుట్ స్థలంలో ఏర్పాటు చేసిన కంచెను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తొలిగించారని, ఫిర్యాదు చేసినా విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. వారి పై చర్య ఎందుకు తీసుకోలేదని,తిరిగి కంచె ఏర్పాటు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మున్సిపాల్టీ లే అవుట్ ద్వారా వచ్చిన ప్రతి స్థలంలో చుట్టూ కొలతలతో,హద్దులుతో బోర్డులు ఏర్పాటు చేసి మున్సిపాల్టీ ఆస్తులను కాపాడాలని కోరారు.

3వ వార్డులో స్థానిక శాసనసభ్యుని ఇంటికి కూత వేటు దూరంలో రిజిస్ట్రేషన్ తో డి.ట్.సి.పి లే అవుట్ అనుమతితో మున్సిపాల్టీ స్థలాన్ని కొంత ఆక్రమించి కట్టడం జరుపుతున్న ఎందుకు అధికారులు అడ్డుకోవడం లేదన్నారు. ఇక్కడి మున్సిపాల్టీ స్థలంలో  కౌన్సిల్ తీర్మానం ద్వారా పార్కు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని అన్నారు. గతంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అర్ధరాత్రి వేళ మున్సిపాల్టీ కార్యాలయంలో మున్సిపాల్టీ కి చెందిన లే అవుట్ భూముల దస్తా వేజులు అపహరణకు గురి కావడం జరిగిందని, ఈ విషయంపై గత టి.పి.ఓ ఆధార పూర్వకంగా తెలపడం జరిగిందని, వాటికి సంబంధించిన  సర్టిఫై కాపీలు ఇవ్వాలని కమీషనర్ ను అడగడం జరిగిందని తెలిపారు.

హుజూర్ నగర్ మున్సిపాల్టీకి చెందిన లే అవుట్ భూములను,ప్రభుత్వం భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని,అధికారులు మున్సిపాల్టీకి చెందిన లే అవుట్ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణకు గురి అయినయో వెంటనే గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవాలని,లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలోనే చలో మున్సిపాల్టీ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు.మున్సిపాల్టీ పరిధిలో ఎటువంటి ప్రభుత్వం అనుమతులు లేకుండా పుట్ట గొడుగుల్లా వెలుస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లను అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కోరారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

మునిగిపోతున్న మహిళల్ని కాపాడిన పోలీసులు

Bhavani

విమానాల మరమత్తు కేంద్రం ఏర్పాటుకు కెనెడా ఏవియేషన్ కంపెనీ

Bhavani

చైనా కరోనా ఆందోళనలకు అమెరికా మద్దతు

Satyam NEWS

Leave a Comment