35.2 C
Hyderabad
May 1, 2024 00: 30 AM
Slider మహబూబ్ నగర్

మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించాలి

#congress

వనపర్తి జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేసిన వనపర్తి శాసనసభ స్థాయి కొత్త పాత నాయకులు ఆత్మీయ సమ్మేళనానికి వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్  అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ జి. చిన్నారెడ్డి,  తూడి మెగా రెడ్డి  పెద్దమందడి ఎంపీపీ  మాట్లాడుతూ మంత్రి నిరంజన్ రెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ జి. చిన్నారెడ్డి  మాట్లాడుతూ స్థానిక మంత్రికి అహంకారం పెరిగిందని బూతులు మాట్లాడడమే అతనికి దినచర్యగా మారిందని ఆరోపించారు.

ఎంతో చరిత్ర ఉన్న వనపర్తి శాసనసభ స్థానానికి ఒక్కసారి శాసనసభ్యులుగా ఎన్నికై అవినీతి ఆరోపణలలో వనపర్తి పేరును తీసుకురావడం తనకే చెల్లిందని మండిపడ్డారు. మెగా రెడ్డి  మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో అందరు శాసనసభ్యులు పూల మొక్కలైతే మంత్రి మాత్రం గంజాయి మొక్క అన్నారు. ప్రజలే గెలిపించారని, ప్రజలే ఓడిస్తారని  అతి త్వరలో బయటపడుతుందని చెప్పారు. అందరం కలిసికట్టుగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఏడు మండలాల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజవర్గ నలుమూలల నుండి  కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండలం, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ఇళ్ల స్థలాల పంపిణీలో వేగం పెంచాలి

Sub Editor

అడ్డంగా కట్టిన కట్టలతో కొద్ది వరదకే గోదావరి పొంగడం ఖాయం

Satyam NEWS

96వ రోజుకు రాజధాని అమరావతి ప్రజల పోరాటం

Satyam NEWS

Leave a Comment