27.7 C
Hyderabad
May 7, 2024 08: 26 AM
Slider కవి ప్రపంచం

మూగబోయిన పాటకు…

#purimalla new

గద్దరన్నకు! ఉద్యమ జోహార్లు!

పాటకు చిరునామై

ప్రజల గొంతుల్లో పల్లవించిన పోరు బాటకు జోహార్లు!

కళామతల్లి ముద్దుబిడ్డై

ఋణం తీర్చుకున్న

గోచి గొంగడి  రూపానికి జోహార్లు!

డప్పు దరువు చేతి కర్రై

నడిచొచ్చిన

తిరుగుబాటు గీతానికి జోహార్లు!

భూమి కోసం భుక్తి కోసం

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం

పరితపించిన విప్లవ వీరుడికి జోహార్లు!

బండెనక బండికట్టుకుని

ఆత్మను అమర లోకానికి

తీసుకొని వెళ్ళిన

శ్రమ జీవుల ప్రతినిధికి జోహార్లు!

గాయపడిన గేయంతో

కూలితల్లుల దుఃఖాన్ని

తుడిచిన  మానవతా వాది జోహార్లు!

ప్రేమగా సాదుకొన్న ఆడపిల్లకు

పాదం మీద పుట్టుమచ్చలా

బతుకంతా తోడుండాలని చెప్పిన

సంస్కృతి సంప్రదాయాల విలువల నిధీ జోహార్లు!

పొడుస్తున్న పొద్దుమీద

నడుస్తున్న కాలంతో కటీఫ్ చేసి

లోకం నుండి నిష్క్రమించిన  భావ కవితా ఝరీ జోహార్లు!

నువు కట్టిన గజ్జెలు 

నిన్నే పిలుస్తున్నాయి

పాటవై మళ్ళీ రమ్మనీ

కళా హృదయాలు కలవరిస్తున్నాయి

నీతో పంచుకున్న జ్ఞాపకాలను

సిరిమల్లె చెట్టు కింద తల్లులంతా విలపిస్తున్నరు

మళ్లెప్పుడు కనబడతవు బిడ్డా అని!

మరణం ముద్దాడిన గద్ధరన్నా!

అరుణారుణ పతాకమై

నీవెప్పుడూ సజీవుడవే!

వురిమళ్ల సునంద, ఖమ్మం, 9441815722

Related posts

స్పోర్ట్స్ మీట్ లో సందడి చేసిన జిహెచ్ఎంసి మహిళా కార్పొరేటర్లు

Satyam NEWS

ప్రభుత్వం ఏర్పాటు చేసే కంటి వెలుగు సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS

మెదక్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం లో ఐదుగురి మృతి

Satyam NEWS

Leave a Comment