38.2 C
Hyderabad
April 29, 2024 11: 35 AM
Slider తూర్పుగోదావరి

అడ్డంగా కట్టిన కట్టలతో కొద్ది వరదకే గోదావరి పొంగడం ఖాయం

#river Godavari

గతంలో వచ్చే వరదలకు ఎటువంటి అడ్డుకట్టలు గోదావరి మీద లేకపోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి వెళ్ళేది. ఈ సారి అలా కనిపించడం లేదు.

ఏ వరద లేని సమయంలోనే నీరంతా వెనక్కి వస్తున్న క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ముంపు గ్రామాల ప్రజలు రాబోయే వర్షాకాలం తలచుకుని భయపడుతున్నారు. 

ఇప్పుడు వరద వస్తే డ్యాం దగ్గర నీరు నిల్వవుండి వెనక్కి మరింత తాకి ముంపు గ్రామాలను ఇంతకు ముందుకంటే ఎక్కువగా ముంచుతుందనే ఆందోళనలో ఉన్నారు.

ఒక వేళ భ్యారేజ్ దగ్గర వాటర్ దిగువకు పంపించినప్పటికి ముంపుకు వరదనేది తప్పదు అని అంటున్నారు.

విలీన మండలాల్లో ఉన్న పలు మండలాల్లోని గ్రామాలు గోదావరి తీరం ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ వరదలు వస్తే చాలా మండలాల్లోని గ్రామాలు కు రహదారులు కట్ అయ్యే అవకాశాలున్నాయి.

వి.అర్.పురం మండలంలో ఉమ్మడివరం- అన్నవరం , సోములగూడెం మధ్య,  రామవరం, తుష్టివారిగూడెం మధ్య, చింతరేగుపల్లి పలు గ్రామాల మధ్య రహదారులు కట్ అవుతాయి.

రేఖపల్లి- అన్నవరం కు కూడా దారుండదు. మరి గ్రామలన్ని నీటి మధ్యలో ఉంటాయి. మరి కొన్ని గ్రామాలు మునిగి పోతాయి.

ఆ సమయంలో తరలింపు అంటే సాధ్యం కానిది. కాబట్టి ముందస్తుగానే ఆప్తమత్తం చేయాలి.

ఆందోళన చెందుతున్న ప్రజల సమాచారాన్ని పత్రికల ద్వారా బయటకు తెలియ జేస్తునప్పటికి గోదావరి వరదల గురించి జిల్లా, డివిజన్, మండల అధికారులు స్పందించడం లేదు.

Related posts

సిలిండర్ ధరలను పెంచటాన్ని వ్యతరేకించండి

Murali Krishna

కేటీఆర్… ముందు అర్ధరాత్రి వరకూ మందుతాగించే పని మానుకో

Satyam NEWS

బాధ్యతలేని ముఖ్యమంత్రి కార్యాలయం మెడకు ఉచ్చు లాంటిదే

Satyam NEWS

Leave a Comment