37.2 C
Hyderabad
May 2, 2024 13: 57 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు అందరం కలిసి శ్రమిద్దాం

#jgeetareddy

కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం త్వరలో రాబోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు,మాజీ మంత్రి,టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షురాలు జె.గీతారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో శుక్రవారం జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదు బూత్ ఎన్రోలర్ లు,బ్లాక్ మండల కాంగ్రెస్ అధ్యక్షుల సమీక్షా సమావేశంలో గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రత కోసం తమ నాయకులను కోల్పోయిందని అన్నారు.

ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తృణప్రాయంగా అర్పించినారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సాధించి,దేశ సమగ్ర అభివృద్ధికి బాటలు వేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీయే అన్నారు.కాంగ్రెస్ పార్టీ నష్ట పోతుందని తెలిసినా,సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం అదృష్టంగా భావించాలని గీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రెండు లక్షల భీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. బూత్ ఎన్రోలర్లు క్షేత్ర స్థాయిలో బాగా పనిచేస్తున్నారని ఆమె  కితాబు ఇచ్చారు.

నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెసు పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో కంపు కొడుతుందని,రైతులకు మద్దతు ధర కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అన్నారు.రైతుల దాన్యం కొనుగోలు విషయంలో టిఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో కనీసం నోరు మెదపలేదని,తాను కల్పించుకుని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీసిన విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేశారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవబోయేది కాంగ్రెస్ పార్టీయే అని, సభ్యత్వ నమోదులో దేశంలోనే నల్లగొండ పార్లమెంటు అగ్రస్థానంలో ఉంచాలని అన్నారు. ప్రతి బూత్ లో 300 తక్కువ కాకుండా సభ్యత్వ నమోదు అయ్యేట్లు బూత్ ఎన్రోలర్ లు ప్రణాళిక తయారు చేసుకోవాలని,సభ్యత్వ నమోదు ఎక్కువ చేసిన వారికి పార్టీలో ప్రాధాన్యం, ప్రోత్సాహంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో సత్కారం ఉంటుందని అన్నారు. లక్ష సభ్యత్వం టార్గెట్ గా పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు,ఐఎన్టియుసి అధ్యక్షుడు యరగాని నాగన్న గౌడ్,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు నిజాముద్దీన్, పిసిసి జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాచిమంచి గిరిబాబు,ఐ ఎన్ టి యు సి నాయకుడు మేళ్ళచెరువు ముక్కంటి,దొంతగాని జగన్,జక్కుల మల్లయ్య,సైదా, మాజీ జెడ్పీటిసి గల్లా వెంకటేశ్వర్లు,మహిళా కాంగ్రెస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

మంత్రి పేర్ని నానికి ఘాటుగా సమాధానం ఇచ్చిన వంగవీటి రాధ

Satyam NEWS

భారత్ లో ఉండటం క్షేమం కాదు వెంటనే వచ్చేయండి

Satyam NEWS

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కార్పోరేటర్ దొడ్ల

Satyam NEWS

Leave a Comment