35.2 C
Hyderabad
April 27, 2024 11: 43 AM
Slider నల్గొండ

పింఛన్లు,నిరుద్యోగ భృతి,డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వండి మహాప్రభో

#hujurnagarcongress

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని టి.పి.సి.సి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండి.అజీజ్ పాషా కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలు నమోదు కార్యక్రమంలో భాగంగా సోమవారం బూత్ నెంబర్ 2018 లో బూతు ఎన్రోల్మెంట్ షేక్ నజీర్ అహ్మద్ నిర్వహించిన కార్యక్రమానికి అజీజ్ పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన డిజిటల్ సభ్యత్వ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందన లభిస్తుందని అన్నారు. డిజిటల్ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల భీమా సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను,ప్రజలను మభ్యపెడుతున్నారని,ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేస్తున్నారని అజీజ్ పాషా ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుండి వితంతు పెన్షన్లు, నిరుద్యోగ భృతి,రైతు ఋణమాఫీలు, డబుల్ బెడ్రూం ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను మాయమాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పాషా అన్నారు.

ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని ప్రతి ఒక్కరూ అంటున్నారని,కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు,సభ్యులు,అనుబంధ సంఘాల వారు పార్టీ డిజిటల్  సభ్యత్వంలో భాగస్వాములై సభ్యత్వ నమోదును పండగ వాతావరణంలా జరుపుతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ సభ్యులు షేక్.నజీర్ అహ్మద్,చక్రాల సురేష్,నరేష్,కాంతమ్మ,నూర్జహాన్, కృష్ణవేణి,వనపర్తి శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

Satyam NEWS

కౌలాస్ నాలా ప్రాజెక్టు లో పడి ఒకరు గల్లంతు

Satyam NEWS

బెనిఫిట్… బెనిఫిట్… బెనిఫిట్: వెన్నెముక లేని పెద్ద హీరోలు

Satyam NEWS

Leave a Comment