February 28, 2024 08: 50 AM
Slider మహబూబ్ నగర్

రోడ్ల విస్తరణ పూర్తి అయితే చూడలేకపోతున్నారా?

#wanaparthy

వనపర్తిలో కాంగ్రెస్ అరాచకాలు, దౌర్జన్యాలను అడ్డుకుంటామని, ప్రజల చిరకాల వాంఛ రోడ్ల విస్తరణ పూర్తయి పట్టణం సుందరంగా కనిపిస్తుంటే కాంగ్రెస్ వారు సహించలేక పోతున్నారని మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్ ఆరోపించారు. మాయమాటలతో గెలిచి గతములో జరిగిన అభివృద్ధిని మించి అభివృద్ధి చేయలేక ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పదోవ పట్టిస్తున్నారని గట్టు యాదవ్  విమర్శించారు. వనపర్తిలో రోడ్ల విస్తరణలో బాగంగా ఫుట్ పాత్ వ్యాపారస్తులకు శాశ్వత నిర్మాణాలు కట్టించడం జరిగిందని అందులో భాగంగా రాజీవ్ చౌరస్తాలో కూడా శాశ్వత నిర్మాణాలు చేస్తామని చెప్పగా వ్యాపారస్తులు మమల్ని నమ్మి స్వచ్ఛందంగా షాపులు తొలగించుకున్నారని తెలిపారు.

ఎన్నికలు రావడం చేత ఆలస్యం జరిగిందని తెలిపారు. వ్యాపారస్తుల కోరిక మేరకు వాళ్ళ యధాస్థానంలో నిర్మించుకోవడానికి ఒక మేస్త్రిని నియమించుకున్నరన్నారు. దీన్ని సాకుగా తీసుకొని కాంగ్రెస్ వారు ఛైర్మెన్ లంచం తీసుకున్నాడని ఆరోపణలు చేయడాన్ని  ఖండిస్తున్నామన్నారు. 40ఎండ్లుగా వున్న వ్యాపారస్తులను కాదని కాంగ్రెస్ వారు తమ అనుచరులకు షాపులు కేటాయించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వారు జరగుతున్న అభివృద్ధికి సహకరించి కొత్తగా అభివృద్ధి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని హితవు పలికారు. మునిసిపల్ ఛైర్మెన్ వెంట కౌన్సిలర్స్ పాకనాటి కృష్ణ, బండారు కృష్ణ, నాగన్న యాదవ్, నాయకులు ఉంగులం తిరుమల్, స్టార్ రహీమ్, గోపాల్ యాదవ్, డానియల్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

చర్చీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన

Satyam NEWS

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు బి ఎం ఏస్ నిరసన

Satyam NEWS

పీఎస్‌లో హిజ్రాల రణరంగం

Bhavani

Leave a Comment

error: Content is protected !!