33.7 C
Hyderabad
April 29, 2024 01: 47 AM
Slider ప్రత్యేకం

మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలి

#mission baheeratha

మిషన్ భగీరథ కార్మికులను పర్మినెంట్ చేయాలని తెలంగాణ మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్  అండ్ వర్కర్ యూనియన్స్ రాష్ట్ర కార్యదర్శి  వంగూర్ రాములు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా విస్తృత సమావేశం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వంగూర్ రాములు మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని వారికి కనీస వేతనం 21000 ఇస్తూ పి ఎఫ్, ఈఎస్ ఐ హెల్త్ కార్డులు, బోనస్ వారాంతపు సెలవులు ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ సక్రమంగా నీళ్లు అందించడానికి రాత్రి పగలు రోజుకు 12 గంటలు పనిచేస్తూ వారికి భద్రతా పరికరాలు టార్చ్ లైట్ లు లేకుండా పనిచేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని గుర్తింపు కార్డు లేనందున రాత్రిపూట తిరిగే సమయంలో పోలీసులు ఆపు తున్నారని పేర్కొన్నారు. కార్మికులకు అన్ని రకాల పరికరాలు అందజేస్తూ పెట్రోల్ ఫోన్ బిల్లులు ఇవ్వాలన్నారు. సెప్టెంబర్ ఆరవ తేదీన హైదరాబాద్ లో జరిగే ధర్నలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లో ఎల్లా అధ్యక్షుడు భూషణుని ఆంజనేయులు జిల్లా నాయకులు బాలస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

GO 317 : తొమ్మిదికి పెరిగిన ఉపాధ్యాయుల ఆత్మహత్యలు

Satyam NEWS

అంగరంగ వైభవంగా యువసేన గణనాథుని నిమజ్జన శోభాయాత్ర

Satyam NEWS

నేను బీసీ ల ఇంటి కోడల్ని

Bhavani

Leave a Comment