31.2 C
Hyderabad
May 12, 2024 01: 16 AM
Slider ప్రత్యేకం

దాడుల నుంచి జర్నలిస్టులకు లోకేష్ భరోసా

#lokesh

రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్ చేసే ఇష్టారీతి అప్పులతో ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం, సాలుచింతలలో మీడియా ప్రతినిధులతో ఆయన నేడు చిట్ చాట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం చేతిలో మీడియా వారూ బాధితులేనని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోరాటం చేసినట్లు ఇప్పుడు చేయడం లేదని ఆయన జర్నలిస్టులకు చురక అంటించారు. సమాజాన్ని జగన్ గీత గీసి విడదీశారు. ఇది మీడియాకూ అంటుకుంది. మీడియాను విడదీసింది జగనే. ఇది చాలా దూరం వెళ్లింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఐదుగురు వేరు వేరు కులస్తులు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి ఉందా? ఇదంతా ఐ ప్యాక్ తెచ్చిందే. రామ్ గోపాల్ వర్మ కూడా ఇక్కడ కులాల ప్రస్తావన తెస్తున్నారు..అదే తెలంగాణలో మాట్లాడితే తంతారు అని లోకేష్ వ్యాఖ్యానించారు.

టీడీపీ కార్యకర్తలపై, కార్యాలయాలు, బీసీ, దళితులపై దాడులు చేస్తే మాపై కాదు కదా..అని అందరూ అనుకున్నారు. నన్నూ వ్యక్తిగతంగా దూషించారు. జాఫర్, విజయ్ పాత్రుడు ఫ్యామిలీని బయటకు లాగారు. అది రేపు మీ ఇంటికి కూడా వస్తుంది అని ఆయన అన్నారు. కొన్ని ఛానల్స్ వైసీసీ ప్రోత్సాహంతో లేనిది ఉన్నట్లు చూపిస్తూ..వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాయి. 2012 నుండి నన్ను, బ్రాహ్మణిని ట్రోల్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వెళ్తే భయపడతారనేది వైసీపీ విధానం. దానికి జర్నలిస్టులు సహకరిస్తే ఎలా అని లోకేష్ ప్రశ్నించారు.

అది అలా ఉంచితే మీడియా మిత్రుల గొంతు నొక్కే జీవోలు వస్తే మీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు.? అని లోకేష్ ప్రశ్నించారు. మా ప్రభుత్వం వచ్చాక జర్నలిస్టులపై దొంగ కేసులు ఉండవు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులకు సంక్షేమ నిధి, రిటైర్ మెంట్ తర్వాత బెనిఫిట్స్, ప్రత్యేక చట్టం గురించి పార్టీ పెద్దలతో మాట్లాడి నేను నిర్ణయం ప్రకటిస్తా అని లోకేష్ హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలతో పాటు జర్నలిస్టులకు కూడా మూడేళ్లలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

సీఎం పుట్టినరోజు మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

Sub Editor

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

దట్టమైన అడవి అయితేనేం అమ్మాయి గుట్టుకనిపెట్టారు

Satyam NEWS

Leave a Comment