29.7 C
Hyderabad
May 1, 2024 06: 12 AM
Slider సినిమా

విడుదలకు సిద్ధమైన “బంగారు తెలంగాణ”

బిపిన్, రమ్య జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి రమ్య సమర్పణలో సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సారథ్యంలో బిపిన్ దర్శక, నిర్మాతగా రూపొందించిన చిత్రం ” బంగారు తెలంగాణ”. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి “యు” సర్టిఫికేట్ లభించింది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు “బంగారు తెలంగాణ” చిత్ర విశేషాలను తెలియజేశారు..

కో- ప్రొడ్యూసర్స్: లయన్ డా. ఏవీ స్వామి, ఏవీ అనురాధ, పిన్నింటి జానకి రామారావు మాట్లాడుతూ.. ” ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలందరికీ మేలు కలిగేలా తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారు.. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చిన తెలంగాణ దేవుడు కేసీఆర్… ఆనాడు త్రేతాయుగంలో రామరాజ్యం చూశారు. ఈనాడు ఈ బంగారు తెలంగాణాలో మరో రామరాజ్యం చూస్తున్నారు. అవన్నీ మా చిత్రంలో పొందుపరిచి.. అసలు తెలంగాణ ఎలా ఆవిర్భవించిందో మా డైరెక్టర్ బిపిన్ చాలా గొప్పగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు కాకుండా యావత్ రెండు రాష్ట్రాల ప్రజలందరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సెన్సార్ కార్యక్రమాలు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలోనే చాలా భారీగా అత్యధిక థియేటర్సలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.. అలాగే ప్రొపెసర్ జయశంకర్ సార్ గారికి, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం.. అన్నారు.

నిర్మాత-దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ.. ” కేసీఆర్ గారి కృషికి ప్రతిరూపమే ఈ బంగారు తెలంగాణ. ఆయన ప్రాణాలకు తెగించి.. ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అలాగే ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను అర్పించారు. వారందరి సమిష్టి కృషి ఫలితంగానే బంగారు తెలంగాణ సాధ్యమయింది. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు సంభవించాయి అనేది ఈ చిత్ర మెయిన్ కాన్సెప్ట్. మా నిర్మాతలందరూ ఈ సినిమా అద్భుతంగా రావడానికి నాకు ఎంతగానో సహకరించారు. వారందరి సహకారంవల్లనే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాను.. ఈ నెలలోనే కేటీఆర్ గారిచేత ట్రైలర్ లాంఛ్ చేసి డిసెంబర్ లో బంగారు తెలంగాణ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేస్తాం. ఖచ్చితంగా ఈ చిత్రాన్ని ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. . అన్నారు.

బాబు మోహన్, అశోక్ కుమార్, రఘునాథ్ రెడ్డి, డా. ఏవీ స్వామి, సాయి త్రిశాంక్, కృష్ణవేణి, కవిత, దివ్య, డింకీ కపూర్, క్రాంతి, ప్రీతీ నిగమ్, రాగిణి, ముంతాజ్, సునీత మనోహర్, కల్పన, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధు ఏ.నాయుడు, జియస్ఆర్, ఆళ్ల రాంబాబు, ఎడిటింగ్; నాగిరెడ్డి, పి.ఆర్. ఓ: జిల్లా సురేష్, కో- ప్రొడ్యూసర్స్: డా. ఏవీ స్వామి, ఏవీ. అనురాధ, పిన్నింటి జానకి రామారావు, కథ-మాటలు-పాటలు-సంగీతం-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం; బిపిన్.

Related posts

కాంగ్రెస్ లో చేరిన సదాశివనగర్ వైస్ ఎంపీపీ

Satyam NEWS

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ లో నారాయణ విద్యార్ధిని ఘనత

Satyam NEWS

రాయపూర్-విశాఖ రహదారి ని అభివృద్ధి చేసిందెవరనుకున్నారు…!

Bhavani

Leave a Comment