31.7 C
Hyderabad
May 2, 2024 10: 36 AM
Slider ముఖ్యంశాలు

ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఛాయాచిత్ర ప్రదర్శన

pib

రాజ్యాంగ దినోత్స‌వం సంద‌ర్భం గా స‌మాచార- ప్ర‌సార మంత్రిత్వ శాఖ లోని రీజ‌న‌ల్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం ఆర్ట్స్ కాలేజి లో భార‌త రాజ్యాంగ ఛాయాచిత్ర ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేశారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న మూడు రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఉస్మానియా విశ్వ‌ద్యాల‌యం రిజిస్ట్రార్ డాక్ట‌ర్ సి.హెచ్‌. గోపాల్ రెడ్డి జ్యోతి ని వెలిగించి, ఈ ప్ర‌ద‌ర్శ‌న ను ప్రారంభించారు.  ఆయ‌న రాజ్యాంగ పీఠిక ను చ‌దవ‌గా,  కార్యక్రమాని కి త‌ర‌లి వ‌చ్చిన వారు సైతం ఆ పీఠిక పాఠాన్ని తాము కూడా చ‌దివారు. 

ఈ సంద‌ర్భం గా  డాక్ట‌ర్ సి.హెచ్‌. గోపాల్ రెడ్డి ప్ర‌సంగిస్తూ, మ‌నం భిన్న సంస్కృతులు, వేరు వేరు భాష‌లు, వివిధ ప్రాంతాల కు చెందిన వారైనా మ‌న‌లను ఒక్క‌టిగా క‌లిపి ఉంచుతున్న‌ది మ‌న రాజ్యాంగ‌మే అన్నారు.  రాజ్యాంగం మ‌న దేశానికి స్థిర‌మైన ప్ర‌భుత్వాన్ని అందించింద‌ని, భార‌త‌దేశం త్వ‌ర‌లో 5 ట్రిలియ‌న్ డాల‌ర్ విలువ క‌లిగిన ఆర్థిక వ్య‌వ‌స్థ గా ఎదిగే దిశ గా ప‌య‌నిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఈ కార్య‌క్ర‌మ అతిథులలో ఒకరుగా విచ్చేసిన వెస్ట‌ర్న్ సిడ్నీ యూనివ‌ర్సిటీ ప్రో వైస్ ఛాన్స్‌ ల‌ర్  లిండా  మాట్లాడుతూ, ఏ దేశం సాధించిన ప్ర‌గ‌తి అయినా ఆ దేశ రాజ్యాంగం లో పొందుప‌ర‌చిన సూత్రాల ఆధారం గా సాధించేదే అన్నారు. 

భార‌త‌దేశం వివిధ‌త్వాల నడుమ స‌మైక్యం గా ఉన్న దేశానికి ఒక చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ అంటూ అమె ప్రశంసించారు. స‌మాచార- ప్ర‌సార మంత్రిత్వ శాఖ లో భాగ‌మైన ప‌త్రికా స‌మాచార కార్యాల‌యం (పిఐబి), హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌  ఎస్‌. వెంక‌టేశ్వ‌ర్ ఈ కార్య‌క్ర‌మం లో మాట్లాడుతూ, మ‌న రాజ్యాంగ శిల్పులు దేశ ప్ర‌జ‌ల కోసం ఉద్దేశించి స‌మాన‌త్వం, న్యాయం స్వేచ్ఛ‌, మ‌రియు సౌభ్రాతృత్వ సిద్ధాంతాల ను మ‌న రాజ్యాంగం లో ఉల్లేఖించార‌ని గుర్తుకు తెచ్చారు. ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం లో క‌మ్యూనికేష‌న్, జ‌ర్న‌లిజమ్ విభాగం ప్రొఫెసర్ కె. నాగేశ్వ‌ర్ ఈ కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగిస్తూ, ప‌లు దేశాల నేత‌ల లో ఆందోళ‌న‌లు ఉన్న‌ప్ప‌టికీ కూడాను, మ‌న దేశ రాజ్యాంగం కాల ప‌రీక్ష‌కు త‌ట్టుకొని నిల‌చింద‌న్నారు. 

మ‌న రాజ్యాంగం అతి పెద్దది, చాలా విస్తృత‌మైన‌ది, ఎంతో క‌ఠిన‌మైన‌ అస్తిత్వం లో ఉండ‌టానికి  అవసరమైన‌ దాని కన్నా అధిక‌మైందని భావించార‌ని ఆయ‌న వివ‌రించారు.  ఈ న‌మ్మ‌కాలకు భిన్నంగా మ‌న రాజ్యాంగం ప్ర‌పంచం లోని 192 రాజ్యాంగాల లో 70 సంవంత్స‌రాల త‌ర‌బ‌డి మ‌నుగ‌డ లో ఉన్న‌ ఒక రాజ్యాంగం గా పేరు తెచ్చుకొంద‌న్నారు. రీజ‌న‌ల్ అవుట్ రీచ్ బ్యూరో (ఆర్ఒబి) ఈ సంద‌ర్భం గా నిర్వ‌హించిన వ్యాస ర‌చ‌న పోటీ లో విజేత‌లుగా నిలచిన వారికి బ‌హుమ‌తుల ను ప్ర‌దానం చేశారు.  ఆర్ఒబి కి చెందిన గేయ & నాట‌క విభాగం క‌ళాకారులు ఒక సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని స‌మ‌ర్పించారు.

ఎగ్జిబిషన్ లో అబేడ్క‌ర్ కు చెందిన అరుదైన న‌లుపు- తెలుపు ఛాయాచిత్రాలతో పాటు ఆయన బోధనల‌ను, ఆయ‌న వ్రాసిన గ్రంథాల‌ను కూడా ఉంచారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిప‌ల్‌, ప్రొఫెస‌ర్ డి. ర‌వీంద‌ర్‌, యూనివ‌ర్సిటీ జ‌ర్న‌లిజం విభాగం అధిప‌తి ప్రొఫెస‌ర్ స్టీవెన్స‌న్‌, పిఐబి డిప్యూటీ డైరెక్ట‌ర్  పి. రత్నాకర్, ఆర్ఒబి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మాన‌స్ కృష్ణ‌కాంత్‌, ఆర్ఒబి ఎఫ్‌పిఒ లు శ్రీ జి. కోటేశ్వరరావు,  అర్థ శ్రీనివాస్ కూడా హాజ‌ర‌య్యారు.

Related posts

ఇస్లామిక్ టెర్రరిస్టుల్లా ప్రవర్తిస్తున్న రష్యన్ సైనికులు

Satyam NEWS

హిందూత్వం అంటే మతం కాదు ధర్మం…

Satyam NEWS

శ్రీకృష్ణ సత్యభామ రూపిణీ సమేత కళ్యాణం

Satyam NEWS

Leave a Comment