36.2 C
Hyderabad
April 27, 2024 21: 38 PM
Slider ముఖ్యంశాలు

సమైక్య పాలనలో దుర్భిక్షం.. స్వపరిపాలనలో సుభిక్షం

#Harish rao

సమైక్య పాలనలో రాష్ట్రం దుర్భిక్షంగా ఉండే.. నేడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో స్వపరిపాలనలో సుభిక్షంగా అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

శనివారం మెదక్ నియోజకవర్గం పరిధిలోని రామాయంపేట బీజేపీ మున్సిపాల్ కౌన్సిలర్లు, కోమటిపల్లి, సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన నాయకులను మంత్రి హరీష్ రావు గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ హాయాంలో రూ.2 వందల ఉన్న ఫించన్ నేడు రూ.2 వేలు, వికాలాంగుల ఫించన్ ను రూ.4 వేలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రీషయన్ కిట్ అందిస్తూ సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.

మిషన్ భగీరథ పథకంతో బిడ్డల త్రాగునీటి కష్టాలను తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రామాయంపేట అభివృద్ధి దశల వారీగా చేసుకుందామని రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీ మధ్యలోనే ఉంటూ మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆవిడను ఆశీర్వదించాలని కోరారు.

Related posts

జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన బిచ్కుంద క్రీడాకారుడు

Satyam NEWS

ఆ కిరాతకులు లారీ డ్రైవర్ క్లీనర్ మరో ఇద్దరు

Satyam NEWS

రష్యా సైనిక ప్రధాన కార్యాలయం ధ్వంసం చేసిన ఉక్రెయిన్

Bhavani

Leave a Comment