29.7 C
Hyderabad
May 3, 2024 06: 11 AM
Slider వరంగల్

వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు

#Dr. Anita Reddy

తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన మీటింగ్ కు సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్, నేషనల్ కన్జుమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి విశిష్ట అతిధిగా విచ్చేశారు. కలెక్టర్ కార్యాలయం దగ్గర లోని సంఘం కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు చట్టం మరియు వయోవృద్దుల చట్టం పై అవగాహన కల్పించారు.

చట్టాల పట్ల అవగాహన ఉంటేనే చట్టాలను వినియోగించు కోగలుగుతారని, వారికి ఏ సమస్యలు ఉన్న తెలియజేయాలని తనుకు తోచిన మేర సహాయసహకారాలు అందిస్తానని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు. అనంతరం ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ గా ఎందరో వృద్ధులకు సమస్యల పరిష్కారం చేసినందుకు, వినియోగదారులు చట్టం పై ప్రజలను చైతన్య పరుస్తున్నందుకు సంఘం వారు డాక్టర్ అనితా రెడ్డి ని DWO ప్రేమలత మరియు అతిధుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప అధ్యక్షులు విజయలక్ష్మీ, మోహన్, ప్రభాకర్, యం. డి. క్రిష్టియన్ దాస్, గోపాల్ రెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెద్దమందడి పోలీస్ స్టేషన్ యస్.ఐ.కి ఛార్జ్ మెమో

Satyam NEWS

పడిపోయిన డ్రైనేజీ రిపేర్

Bhavani

కరోనా కాలానికి ముగింపు!

Sub Editor

Leave a Comment