40.2 C
Hyderabad
May 2, 2024 17: 00 PM
Slider కడప

కడప జిల్లా జడ్పీగిరి కోసం మేడా విజయశేఖర్ రెడ్డి యత్నం

Meda brother

కడప జిల్లా పరిషత్ ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ కుర్చీ కోసం అంతర్గత పోరు తీవ్రంగా వుంది. టీడీపీ నుంచే వైసీపీ లో చేరడానికి ఎన్నికల ముందు రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కి ఎమ్మెల్యే టికెట్ తో పాటు, సోదరుడు కాంట్రాక్టర్ అయిన మేడా రఘునాథరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి నుంచి హామీ పొందారు.

దీంతో రాజంపేట లోనే కాకుండా జిల్లా మొత్తం వైసీపీ అభ్యర్థుల గెలుపునకు మేడా సోదరులు ఆర్థిక అండ దండలు కూడా సమకూర్చినట్లు ప్రచారం సాగింది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్ రెడ్డి పార్టీ టిక్కెట్టు రాకున్నా మేడా మల్లిఖార్జున రెడ్డి గెలువు కోసం కృషి చేసారు. ఈయన కూడా ఎమ్మెల్సీ పదవి ఆశించారు.

ఈ నేపధ్యంలో ఎన్నికలు పూర్తి అయి వైకాపా అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల నేపధ్యంలో శాసన మండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో తీర్మానం చేసి బిల్లు ను ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఊహించని ఈ పరిమాణం కు ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారి ఆశలు అడియాసలు అయ్యే పరిస్థితి ఏర్పడింది.

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే ప్రయత్నం లో భాగంగా ఆశావహుల కళ్లు జిల్లా జడ్పి చైర్మన్ గిరి పై పడ్డాయి. జిల్లా నుంచి ఇందుకోసం పలు పేర్లు వినిపించినప్పటికి జిల్లా వైసీపీ అధ్యక్షుడు అకేపాటి అమరనాథ్ రెడ్డి ఒంటిమిట్ట నుంచి పోటీ చేసి చైర్మన్ గిరి పొందనున్నట్టు ఇందుకు స్పష్టమైన హామీ పొందినట్టు ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు మేడా సోదరులు మండలి రద్దుతో తామకు ఇచ్చిన హామీ ని జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రతి పాదించినట్టు తెలిసింది. ఇందుకోసం పార్టీ పెద్దలతో ముమ్మర ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభించినట్టు కూడా మేడా వర్గీయులు సమాచారం. మేడా పిన తండ్రి కుమారుడు కాంట్రాక్టర్ మేడా విజయశేఖర్ రెడ్డి(బాబు)ని సుండుపల్లె నుంచి గెలిపించి జడ్పీ చైర్మన్ ను చేయాలని ప్రతిపాదించారని ప్రచారం సాగుతోంది.

దీనితో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందుకు మేడా రఘునాథరెడ్డి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలై అభ్యర్థుల ఎంపిక ప్రకటన వెలువడే వరకు ఇలాంటి ఆశావహుల ప్రయత్నాల పేర్లు షికార్లు చేస్తూనే ఉంటాయి.

Related posts

ఫైనల్ జడ్డిమెంట్: విడాకుల కేసుకు ఉరికి సంబంధం లేదు

Satyam NEWS

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పై రేప్ కేసు

Bhavani

దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే

Satyam NEWS

Leave a Comment