38.2 C
Hyderabad
April 29, 2024 14: 55 PM
Slider ముఖ్యంశాలు

దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే

#tammineni

రానున్న ఎన్నికల్లో బిజెపి దాని కూటమి పార్టీలను ఓడిరచడమే దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ లక్ష్యం అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక ఖమ్మం సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నండ్ర ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన పాలేరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో తమ్మినేని వీరభద్రం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బిజెపి దాని కూటమి పార్టీలను ఓడిరచడమే లక్ష్యంగా సిపిఎం పనిచేస్తుందని దానికి అనుకూలంగా కార్యకర్తలు పని చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

దేశంలో ఖచ్చితంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, దానికి కారణం బిజెపి ఆలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన అన్నారు. బిజెపి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రానున్న ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి దాని కూటమి పార్టీలకు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి గానే పని చేస్తామని కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఎన్నికల్లో ముందుకు పోతామని అన్నారు.

ఈ సందర్భంగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని, కచ్చితంగా ఈసారి కేంద్రంలో రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యల మీద ప్రజలు బయటికి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటున్నారని, ఈ ఉద్యమాల ప్రభావం కచ్చితంగా ఎన్నికల్లో ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై సిపిఎం పార్టీగా ఆందోళన చేసే దానికోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, ప్రతి సమస్య మీద రాజీలేని పోరాటం చేయాలని ఆయన సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్‌, భూక్య వీరభద్రం, వైవిక్రమ్‌ జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, షేక్‌ బషీరుద్దీన్‌, సుదర్శన్‌ రెడ్డి, కొమ్ము శ్రీను, గుడవర్తి నాగేశ్వరరావు, దొంగల తిరుపతిరావు, పిన్నింటి రమ్య మండల కార్యదర్శి ఎడవల్లి రమణారెడ్డి, బోడపట్ల సుదర్శన్‌, ఎండి గౌస్‌, బాపట్ల సత్యనారాయణ, అంజయ్య నాయకులు పొన్నెకంటి సంగయ్య, నందిగామ కృష్ణ, తమ్మినేని వెంకట్రావు, నాగేశ్వరరావు, రంజాన్‌, అంగిరేకుల నరసయ్య, తుళ్లూరు నాగేశ్వరరావు, సురేష్‌, మహేందర్‌, వెంకన్న, బింగిరమేష్‌, శీలంగురుమూర్తి, తోటకూరి రాజు, రెంటాల శ్రీను, గంగాధర్‌, కట్టకోల వెంకన్న, పగిడికత్తుల నాగేశ్వరరావు, మూడు గన్యా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కిడ్నీ సమస్యలు తీర్చడానికి మెడికల్ క్యాంప్

Satyam NEWS

అసైన్డ్‌, లంక భూముల రైతుల‌కు పూర్తి హక్కులు

Satyam NEWS

ఐటీ జాబ్స్ రెడీ : కరీంనగర్‌ వాళ్లకే 80 శాతం ఉద్యోగాలు

Satyam NEWS

Leave a Comment